ETV Bharat / state

Bathukamma 2021 special: మీకు తెలుసా.. బతుకమ్మను పేర్చడానికి ఆ పూలే ఎందుకు వాడతారో? - తెలంగాణ వార్తలు

తంగేడు, గునుగు, బంతి, చామంతి వంటి తీరొక్క పూలతో బతుకమ్మను(Bathukamma festival 2021) పేరుస్తారు. ఈ పూలను ఉపయోగించడం వెనుక అద్భుత ఆరోగ్య సూత్రాలు దాగి ఉన్నాయనే విషయం మీకు తెలుసా...? మరి అవేంటో తెలుసుకుందాం రండి...

bathukamma-flowers-like-tangedu-gunugu-banthi-and-chamanthi-have-many-health-principles

author img

By

Published : Oct 13, 2021, 11:23 AM IST

బతుకమ్మ.. మహిళాశక్తిని ప్రతిబింబించే గౌరీదేవి ప్రతిరూపం. ఈమెను వివిధ రకాల పేర్చిన పూల రూపంలో కొలుస్తాం. ఆ పూలన్నీ ఈ కాలంలో దొరికేవే. వీటిని ఉపయోగించడం వెనక ఆరోగ్య సూత్రాలూ ఉన్నాయి. అవేంటంటే...!

తంగేడు: పసుపు రంగులో ఉండే ఈ పూలే కాదు.. మొక్కలోని ప్రతి భాగమూ ఔషధ గుణాలున్నదే. వీటిని మధుమేహం, అల్సర్‌, మలబద్ధక నివారణకే కాకుండా సౌందర్య ఉత్పత్తుల్లోనూ ఉపయోగిస్తారు.

బంతి: పండుగ, పూజ ఏదైనా ఈ పూలకే ప్రాధాన్యం. దీనిలో విటమిన్‌ సి, ఫ్లావనాయిడ్‌ గుణాలుంటాయి.

గునుగు: దీన్ని ప్రపంచవ్యాప్తంగా అలంకరణ కోసం ఉపయోగిస్తారు. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ డయాబెటిక్‌, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలెక్కువ. దెబ్బలు, కాలిన గాయాలు, కడుపునొప్పి మొదలైనవాటికి మంచి మందు.

తీరొక్క పూలతో ఆరోగ్యం మేలు..

మందార: పువ్వే కాదు.. ఆకులు, కాండాల్లోనూ బోలెడు ఔషధ గుణాలు. విటమిన్‌ సి, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఎక్కువగా సౌందర్య ఉత్పత్తుల్లో వినియోగిస్తారు.

గులాబీ: ఎండిన పూరేకలను తలనొప్పి చికిత్సకు ఉపయోగిస్తారు. రోజ్‌వాటర్‌ ముఖానికి తాజాదనాన్ని అందిస్తుంది. చర్మం కింద వాపు వంటివాటినీ అరికడుతుంది.

నందివర్దనం: రక్తపోటు నివారణ మందుల్లో వాడతారు. ఇంకా గాయాలు, కార్డియోవాస్క్యులర్‌, యాంటీ ట్యూమర్‌, యాంటీ ఇన్ఫెక్షన్‌, యాంటీ ఆక్సిడేటివ్‌ ఔషధాల్లోనూ వినియోగిస్తారు.

తామర: మెడిసినల్‌ గుణాలెక్కువ. పురాతన కాలం నుంచీ ఎన్నో వ్యాధుల నివారణకు దీన్ని ఉపయోగిస్తున్నారు. దగ్గు, క్యాన్సర్‌, జ్వరం, నెలసరి సమస్యలు, మొటిమలు, కొలెస్టరాల్‌, మూత్రపిండ సంబంధ వ్యాధులు, మధుమేహం మొదలైన వాటి నివారణ మందుల తయారీలో ఇది తప్పనిసరి.

చామంతి: దీనిలో మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్‌, క్యాల్షియం, ఐరన్‌, సోడియం వంటి మినరల్స్‌ ఉంటాయి. వివిధ వ్యాధులకు వ్యతిరేకంగా పనిచేసే యాంటీ ఆక్సిడెంట్లూ ఎక్కువే.

ఇలా.. ప్రతి పువ్వూ ఓ ఔషధ గనే! మగవాళ్లు పూలను తెస్తే.. ఆడవాళ్లు పూజ చేసి, దగ్గర్లోని బావి, చెరువులు, కాలువల్లో నిమజ్జనం చేయటం సంప్రదాయం. అలా నీటిలోని సూక్ష్మజీవులే నశించడమే కాదు.. వాటిని తాగినవారికీ ఆరోగ్యం సహజసిద్ధంగా లభిస్తుందన్నమాట.

ఇదీ చదవండి: Saddula Bathukamma 2021: గడగడపనా పూల సంబురం.. బతుకు పండుగకు నీరాజనం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.