గాంధీభవన్‌లో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. బతుకమ్మలను ఎత్తుకున్న మహిళలతో కలిసి రేవంత్ రెడ్డి ఫొటోలు దిగారు.
మహిళా కాంగ్రెస్ నేతల ఆటపాటలతో గాంధీభవన్‌లో సందడి నెలకొంది. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మను అలంకరించి హారతి అందించారు. కోలాటాలు, బతుకమ్మ పాటలతో మహిళలు సందడి చేశారు. జగ్గారెడ్డి సైతం వారితో కలిసి బతుకమ్మ ఆడారు.
ఇదీ చదవండి: KTR tour in Sircilla: బంధువుల ఇంటికి మంత్రి కేటీఆర్.. ఏమైందంటే?