రాష్ట్రంలో రేపటి నుంచి బ్యాంకులు (Banks) సాధారణ సమయాల్లోనే పని చేయనున్నాయి. లాక్‌డౌన్ సమయంలో బ్యాంకుల పని వేళల్లో చేసిన మార్పులు రేపటి నుంచి అమలులో ఉండబోవని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ స్పష్టం చేసింది. తెలంగాణలో రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్‌డౌన్ సడలింపు సమయాలు అమలులోకి రానున్నాయి.
మరో గంట ఇళ్లకు వెళ్లడానికి వెసులుబాటు ఉండడంతో సాధారణ సమయాలను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌ఎల్‌బీసీ (Slb) తెలిపింది. అదే విధంగా పూర్తి స్థాయిలో ఉద్యోగులు హాజరు కావాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ స్పష్టం చేసింది.