ETV Bharat / state

పూర్తి స్థాయిలో విస్తరించిన బ్యాంకింగ్‌... గ్రామాలకు సైతం సేవలు - రాష్ట్రం మొత్తం బ్యాంకింగ్​ రంగం...

రాష్ట్రంలో బ్యాంకింగ్‌ రంగం పూర్తి స్థాయిలో విస్తరించింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. బ్రాంచ్​లు ఏర్పాటు చేయలేని పల్లెల్లో అవుట్‌లెట్లు, బిజినెస్‌ కరస్పాడెంట్ల ద్వారా ఖాతాదారులకు సేవలు అందిస్తున్నాయి. విస్తరణ పూర్తి కావడంతో ఖాతాదారులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా బ్యాంకర్లు కృషి చేయాల్సి ఉంది.

Banks Branches Extension Complete In Telangana
పూర్తి స్థాయిలో విస్తరించిన బ్యాంకింగ్‌... గ్రామాలకు సైతం సేవలు
author img

By

Published : Aug 13, 2020, 4:02 AM IST

పూర్తి స్థాయిలో విస్తరించిన బ్యాంకింగ్‌... గ్రామాలకు సైతం సేవలు

రాష్ట్రంలో పల్లెపల్లెకు బ్యాంకింగ్‌ సేవలు విస్తరించినట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రకటించింది. బ్యాంకులకు సంబంధించి 5వేల 728 బ్రాంచిలు పని చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 1782, సెమిఅర్బన్‌ కేంద్రాల్లో 1282, అర్బన్‌ కేంద్రాల్లో 717, మెట్రో కేంద్రమైన హైదరాబాద్‌లో 1947 బ్రాంచిలు సేవలందిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఐదు కిలోమీటర్ల లోపు ప్రజలకు బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులో ఉండాలని రిజర్వ్‌ బ్యాంకు మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.

రాష్ట్రం మొత్తం బ్యాంకింగ్​ రంగం...

5వేలు జనాభా మించి ఉన్న పల్లెల్లో బ్యాంకు శాఖలు ఏర్పాటు చేయాలని 2015 డిసెంబరు 31న ఆర్బీఐ సర్క్యులర్‌ వెల్లడిస్తోంది. ఐతే 2017 మే 18న జారీ చేసిన మరొక సర్క్యులర్‌ బ్యాంకింగ్‌ సేవలు అందని గ్రామాల్లో అవుట్‌ లెట్లు ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొంది. దీంతో బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో వివిధ బ్యాంకులు196 అవుట్‌లెట్లు ఏర్పాటు చేశాయి. దీంతో 2019 డిసెంబరు నాటికే ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రం మొత్తం బ్యాంకింగ్‌ రంగం పూర్తి స్థాయిలో విస్తరించినట్లు బ్యాంకర్లు వెల్లడించారు.

గ్రామాలకు కూడా సేవలు...

ఐతే తొమ్మిది గ్రామాలకు బ్యాంకింగ్‌ సేవలు అందడం లేదని నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ గుర్తించింది. అందులో అదిలాబాద్‌, కుమరంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, జయశంకర్‌, నాగర్‌కర్నూలు జిల్లాల్లో తొమ్మిది గ్రామాలు ఉన్నట్లు ఈ ఏడాది మే 8న వాటికి కూడా బ్యాంకింగ్‌ సేవలు విస్తరించాలని స్పష్టం చేసింది. దీంతో ఆయా బ్యాంకులు బిజినెస్‌ కర్స్‌పాండెంట్లను ఏర్పాటు చేసి ఆ గ్రామాలకు కూడా సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు ఎస్​ఎల్​బీసీ పేర్కొంది.

ఖాతాదారుల సంఖ్యను పెంచుకోవటంపై దృష్టి...

రాష్ట్రంలో ఇప్పట్లో బ్యాంకింగ్‌ రంగం విస్తరించాల్సిన పని లేకపోవడంతో సేవలను మెరుగుపరచి ఖాతాదారుల సంఖ్యను పెంచుకోవడంపై బ్యాంకర్లు దృష్టి సారించారు. పట్టణ, నగర ప్రాంతాల్లో 50శాతానికిపైగా ఖాతాదారులు డిజిటల్‌ లావాదేవీలపై ఆధారపడి ఉండడంతో... బ్యాంకుకు వచ్చే వారి సంఖ్య క్రమేణ తగ్గుతోంది. దీంతో ఖాతాదారులకు వేగవంతమైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే... ప్రభుత్వేతర బ్యాంకుల్లో రుణాలు మంజూరు, ఇతర సేవలు వేగంగా ఉంటున్నాయనే ప్రచారం ఉంది. దీంతో ప్రైవేటుకు తీసిపోని విధంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా సేవలను మెరుగు పరచుకునే దిశలో ముందుకు వెళ్తున్నాయి.

ఇదీ చదవండి: ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహిస్తే రైతులకు మేలు : కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.