ETV Bharat / state

సందర్శనాలయంగా... బంగ్లాదేశ్ నౌక 'ఎం.వి.మా'? - ప్రర్యటక షిప్​గా బంగ్లాదేశ్ నౌక

తీవ్ర వాయుగుండం ప్రభావానికి విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ సరకు రవాణ నౌకను సందర్శనాలయంగా మార్చేందుకు ఏపీ పర్యటకాభివృద్ధి సంస్థ చర్యలు చేపడుతోంది. నౌకను తీసుకువెళ్లడానకిి వ్యయం ఎక్కువగా అవుతున్నందున యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. దీంతో పర్యాటక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

bangladesh-ship-came-to-vishakapatnam-coast-converting-as-tourist-ship
సందర్శనాలయంగా... బంగ్లాదేశ్ నౌక 'ఎం.వి.మా'?
author img

By

Published : Nov 4, 2020, 11:54 AM IST

ఏపీలోని విశాఖ తీరంలోని తెన్నేటి పార్క్‌ సమీపానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ సరకు రవాణ నౌక ‘ఎం.వి.మా’ను సందర్శనాలయంగా మార్చేందుకు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ కసరత్తు చేస్తోంది. తీవ్ర వాయుగుండం ప్రభావానికి అక్టోబర్ 12న తీరానికి కొట్టుకురాగా... ఇప్పటి వరకు వెనక్కి పంపేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా.... నౌకలోని ఇంధనాన్ని సైతం తోడించారు. నౌకను అక్కడి నుంచి సముద్రం లోపలికి తీసుకువెళ్లడానికి మరింత వ్యయం అవనుండడంతో సంబంధిత యజమాని తిరిగి తీసుకువెళ్లేందు ఆసక్తి చూపించడం లేదని తెలిసింది. ఇప్పటికే రూ.లక్షలు ఖర్చు చేయగా మరో రూ.5 కోట్ల వరకు అవుతుందని అంచనాకు రావడంతో తరలించడానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. 2,959 టన్నుల బరువు కలిగిన ఈ నౌకను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది సందర్శనాలయంగా మార్చాలన్నది తాజా ఆలోచన.

నౌక లోపలి భాగాలు, ఇంజిన్, సిబ్బంది పడక గదులు, వంటగదులు, కెప్టెన్‌, ఇతరులకు వినియోగించే గదులను లోపలి నుంచి వీక్షించేలా, వచ్చి వెళ్లేందుకు వీలుగా ప్రవేశ మార్గాలతోపాటు నౌక పైభాగాన్ని ఆతిథ్య సేవలకు ఉపయోగించేలా ప్రణాళిక చేయనున్నారు.

ఇప్పటికే బీచ్‌లో కురుసురా జలంతర్గామి, టీయూ 142 యుద్ధవిమాన ప్రదర్శనశాలలుండగా ఇది అమలు జరిగితే తీరానికి మరింత శోభ తీసుకొచ్చినట్లే అవుతుందని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి దృష్టికి ఏపీ పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తీసుకువెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించి పోర్టు, మెరైన్, నేవీ అధికారులతో చర్చించి అమలులోకి తీసుకురావాలని సూచించినట్లు సమాచారం.

ఇదీ చదవండి: వైన్స్​ షాప్​లో మంటలు... రూ.20 లక్షల లిక్కర్ అగ్నికి​ ఆహుతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.