ETV Bharat / state

Bandi Sanjay Counter to KTR : 'ట్విటర్ టిల్లు.. దేశం మిమ్మల్ని గమనిస్తోంది..' కేటీఆర్​కు బండి సంజయ్ కౌంటర్ - BJP

Bandi Sanjay Counter to KTR : కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజలను ఎలా దోచుకుంటున్నారో దేశమంతా చూస్తోందని.. ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్​కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కౌంటర్​ ఇచ్చారు. మోదీ పాలనలో డబుల్ ఇంజిన్ సర్కార్.. కారును తుక్కు తుక్కుగా చేస్తుందని హెచ్చరించారు.

Bandi Sanjay Fires on Telangana Government
Bandi Sanjay Counter Tweet to KTR
author img

By

Published : Aug 11, 2023, 7:57 PM IST

Bandi Sanjay Counter to KTR : పార్లమెంట్​లో సీఎం కేసీఆర్​ను దూషించిన బండి సంజయ్​పై.. లోక్​సభ స్పీకర్ ఏం చర్యలు తీసుకుంటారు.. అని ట్విటర్​లో ప్రశ్నించిన కేటీఆర్​కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కౌంటర్ ట్వీట్ చేశారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజలను ఎలా దోచుకుంటున్నారో దేశమంతా చూస్తోందని దుయ్యబట్టారు.

Bandi Sanjay Fires on Telangana Government : 'తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నట్లు నిరూపిస్తే.. రాజీనామా చేస్తా'

ట్విటర్ టిల్లు.. ప్రజలను దోచుకోవడం ద్వారా మీ కుటుంబ ఆదాయం ఎలా పెరిగిందనేది కూడా వారు చూస్తున్నారు.. అందుకే మీరు వణికిపోతున్నట్లున్నారని ఎద్దేవా చేశారు. పైకి శత్రువుల్లాగా నటిస్తూ దిల్లీలో మాత్రం కాంగ్రెస్, ఎంఐఎంతో దోస్తీ చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్​కు ఓటేస్తే బీఆర్ఎస్​కు వేసినట్లేనన్నారు. ఆర్టీసీ కార్మికులను ఇన్నిరోజులు విస్మరించిన సర్కార్.. కేవలం ఎన్నికలు వస్తున్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వంలో విలీనం చేసిందని ఆరోపించారు.

ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా.. ప్రభుత్వం స్పందించలేదన్నారు. రైతులు, యువత, 317 జీవో ద్వారా టీచర్లు ఇబ్బందులు పడినా ఏనాడూ ఈ సర్కార్ పట్టించకున్న పాపాన పోలేదని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సమయానికి ఎందుకివ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. మిషన్ భగీరథ నిధులు దుర్వినియోగం చేశారని.. మరుగుదొడ్ల నిర్మాణానికి కేటాయించిన నిధులు దొంగిలించారని ఆరోపించారు.

Bandi Sanjay Family Meet PM Modi : మోదీని కలిసిన బండి.. 'దేశ్ కీ నేతగా అయ్యావని అభినందనలు'

పేదలకు మోదీ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం కోసం డబ్బులు ఎలా వసూలు చేశారన్నారు. ఎంఎన్​ఆర్​ఈజీఏ కార్మికులకు కేటాయించిన నిధులను ఎలా దారిమళ్లించారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు మీరు ఎందుకు సహకరించడం లేదన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ అంశంపై ఇంకెన్ని అబద్ధాలు చెబుతారని.. మోదీ పాలనలోని డబుల్ ఇంజిన్ సర్కార్.. మీ కారును తుక్కు తుక్కుగా చేస్తుందని హెచ్చరించారు.

KTR Fires on Bandi Sanjay over Lok Sabha Speech : ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్‌.. బీజేపీ నేత బండి సంజయ్​పై విరుచుకుపడ్డారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి పేరును అవమానకరంగా మాట్లాడినందుకు.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) లోక్‌సభ సభ్యత్వం రద్దు చేశారని కేటీఆర్ ట్వీట్​లో పేర్కొన్నారు. గురువారం రోజున పార్లమెంట్ సాక్షిగా సీఎం కేసీఆర్‌ గురించి.. బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించారు. మరి ఆయనపై లోక్‌సభ స్పీకర్‌ ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. బండి సంజయ్‌పై తాము ఏలాంటి చర్యలకు సిద్ధపడాలని అడిగారు.

  • .#TwitterTillu are you shaken bcos you have been exposed and now the Nation knows -

    How your family’s income increased by looting people ?

    How you act like you are enemies in Telangana and showcase your friendship with Congress, AIMIM in Delhi against BJP ?

    How a vote for…

    — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) August 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Bandi Sanjay Reacts on TSRTC Bill Issue : 'సీఎం కేసీఆర్​.. గవర్నర్ భుజం మీద తుపాకీ పెట్టి.. కార్మికులను కాల్చే యత్నం చేస్తున్నారు'

Bandi Sanjay as BJP National General Secretary : జాతీయ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.