ETV Bharat / state

రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు: బండి సంజయ్‌ - bandi sanjay latest updates

రైతులు, వలస కార్మికుల సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వివరించారు. ఇవాళ గవర్నర్ తమిళిసై తో భాజపా ప్రతినిధుల బృందం భేటీ అయింది.

sanjay
రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు: బండి సంజయ్‌
author img

By

Published : Apr 27, 2020, 2:25 PM IST

Updated : Apr 27, 2020, 3:56 PM IST

రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు: బండి సంజయ్‌

రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోవడం లేదని ఆరోపించారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌. రైతులు, వలస కార్మికుల సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన వివరించారు. ఇవాళ గవర్నర్ తమిళిసై తో భాజపా ప్రతినిధుల బృందం భేటీ అయింది. ప్రభుత్వం రైతు పాలసీని ప్రకటించలేదని బండి సంజయ్ తెలిపారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరినా.. స్పందన లేదని ఆయన విమర్శించారు. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదని వాపోయారు. రైస్ మిల్లర్లతో కుమ్మక్కై దళారీ వ్యవస్థను పెంచి పోషిస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. చాలాచోట్ల ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: వలస కూలీల సమస్యలను తీర్చిన రాచకొండ సీపీ

Last Updated : Apr 27, 2020, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.