ETV Bharat / state

అలా మాట్లాడే హక్కు మీకు లేదు.. కేసీఆర్​ది త్యాగాల కుటుంబం: బాల్కసుమన్ - balka suman on modi comments

balka suman fires on pm modi: నిన్న హైదరాబాద్ పర్యటనలో మోదీ వ్యాఖ్యలపై తెరాస తీవ్రంగా మండిపడుతోంది. కుటుంబ పార్టీ అంటూ.. తెరాసను ఉద్దేశించి మాట్లాడిన మోదీ వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ధ్వజమెత్తారు. భాజపాలో ఒకే కుటుంబానికి చెందిన వాళ్లు చాలా మంది ఉన్నారని వివరించారు.

balka suman fires on pm modi
కేసీఆర్​ది త్యాగాల కుటుంబం: బాల్కసుమన్
author img

By

Published : May 27, 2022, 12:34 PM IST

balka suman fires on pm modi: కుటుంబ పార్టీల గురించి మాట్లాడే నైతికత ప్రధాని నరేంద్రమోదీకి లేదని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ కుటుంబం త్యాగాలు చేసిందని స్పష్టం చేశారు. భాజపాలోనే ఒకే కుటుంబానికి చెందిన నాయకులు చాలా మంది ఉన్నారని విమర్శించారు. అమిత్‌షా కుమారుడు జైషా బీసీసీఐ సెక్రటరీగా ఉన్నట్లు గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబసభ్యులు ప్రజలతో నేరుగా ఎన్నికయ్యారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ కుటుంబం త్యాగాలు చేసిందని అభిప్రాయపడ్డారు.

''పరివార్ పరివార్ అనే మాట్లాడే అర్హత మీకు ఉందా.. కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఒకే కుటుంబానికి చెందిన చాలా మంది భాజపాలో ఉన్నారు. ప్రధాన మంత్రి స్థాయికి ఇలాంటి మాటలు తగవు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్.. వీళ్లంతా తెలంగాణ ఉద్యమంలో పని చేశారు. ప్రజలు నేరుగా ఎన్నుకున్నారు. కేసీఆర్​ది త్యాగాల కుటుంబం..- బాల్క సుమన్‌, ప్రభుత్వ విప్‌

అలా మాట్లాడే హక్కు మీకు లేదు.. కేసీఆర్​ది త్యాగాల కుటుంబం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.