కరోనా వైరస్ నివారణకు హైదరాబాద్ బాలానగర్లో తమ వంతు బాధ్యతగా మద్యం దుకాణాదారులు కృషి చేస్తున్నారు. మద్యం షాపు ముందు ఇష్టం వచ్చినట్లు నిల్చోకుండా డబ్బాలను గీశారు. అందులో మనిషి మనిషికి కొంత దూరం నిల్చునేలాగా ఏర్పాట్లు చేశారు.
ఇందుకు అనుగుణంగా గీసిన డబ్బాల్లో నిల్చొని మద్యం కొనుగోలు చేస్తున్నారు. కరోన వైరస్ సోకకుండా ముందస్తుగా చర్యలు చేపట్టినట్లు యాజమాన్యం స్పష్టం చేసింది. స్పందించిన స్థానికులు నిర్వాహకులను అభినందిస్తున్నారు.