ETV Bharat / state

Bajrangdal Protest in Telangana : భగ్గుమన్న భజరంగ్​దళ్​.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు - Hyderabad Latest News

Bajrangdal Protest in Telangana : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాల వద్ద భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు తలపెట్టిన 'హనుమాన్‌ చాలీసా పఠనం' కార్యక్రమాలను పోలీసులు భగ్నం చేశారు. ఎక్కడికక్కడ పోలీసులు.. భజరంగ్‌దళ్‌ కార్యకర్తలను అడ్డుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భజరంగ్‌దళ్‌ కార్యకర్తలకు పోటీగా కాంగ్రెస్‌ నేతలు ఆందోళనలు చేపట్టడంతో గాంధీభవన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

Bajrangdal Protest in Telangana
Bajrangdal Protest in Telangana
author img

By

Published : May 5, 2023, 3:32 PM IST

Updated : May 5, 2023, 7:24 PM IST

Bajrangdal Protest in Telangana : కర్ణాటకలో అధికారంలోకి వస్తే భజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామన్న కాంగ్రెస్‌ ఎన్నికల హామీపై ఆ సంస్థ కార్యకర్తలు భగ్గుమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యాలయాల వద్ద భజ్‌రంగ్‌దళ్ కార్యకర్తలు 'హనుమాన్ చాలీసా' పఠిస్తూ నిరసనలకు దిగారు. ఎక్కడికక్కడ పోలీసులు వారిని అడ్డుకున్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ ఎదుట హనుమాన్ చాలీసా పఠనం చేసేందుకు భజరంగ్​దళ్ కార్యకర్తలు విడతల వారీగా భారీగా తరలివచ్చారు. అదే సమయంలో ప్రతిగా కాంగ్రెస్‌ నాయకులు ఆందోళనలు చేపట్టారు. అప్పటికే పెద్ద ఎత్తున పోలీసులు మోహరించగా.. ఇరువర్గాల పోటాపోటీ నినాదాలతో గాంధీభవన్ పరిసరాలు మార్మోగాయి. వారిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించగా.. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ స్టేషన్​కు తరలించారు.

కాంగ్రెస్ కార్యాలయాల వద్ద భజ్‌రంగ్‌దళ్ నిరసనలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లక్ష్మణ్, కిషన్ రెడ్డి తమ వద్దకు వస్తే కలిసి హనుమాన్ చాలీసా చదువుతామని చమత్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ కార్యాలయాల వద్ద భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు హనుమాన్ చాలీసా పఠనానికి యత్నించారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం వద్ద బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నిరసనకారులను పోలీసులు అడ్డున్నారు.

నిజామాబాద్‌లో కమలం నాయకులు రోడ్డుపైనే హనుమాన్ చాలీసా పఠించారు. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌ మహిళా నేత గండ్ర సుజాత ఇంటి ఎదుట బీజేపీ నేతలు కూర్చుని నిరసన తెలపగా.. పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. నిర్మల్‌లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలతో బీజేపీ నేతలు హోరెత్తించారు. మెదక్ కాంగ్రెస్ కార్యాలయం ఎదుట భజరంగ్​దళ్ కార్యకర్తలు నిరసన తెలిపారు. భజరంగ్‌దళ్‌ పిలుపుతో కరీంనగర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కేటీఆర్ ట్వీట్ .. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారంలోకి వస్తే భజరంగ్‌దళ్​ను నిషేధిస్తామని ప్రకటించడాన్ని నిరసిస్తూ బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే.. హనుమాన్ చాలీసా పఠనం వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో స్పందించారు. ఐదేళ్ల డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. అవినీతి, దివాలా కోరు విధానాలే బీజేపీని ఇంటికి పంపుతాయని ఎద్దేవా చేశారు.

  • 5 years of Double Engine & Nothing to show in terms of performance & Delivery to people

    Intellectually Bankrupt & Outrageously Corrupt BJP will be shown the door https://t.co/z6EnO5JQFa

    — KTR (@KTRBRS) May 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

Last Updated : May 5, 2023, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.