ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మరోవైపు భజరంగ్‌దళ్.. డీజీపీ కార్యాలయ ముట్టడికి యత్నించింది. ర్యాలీగా వచ్చిన కార్యకర్తలు.. ఆఫీస్ లోనికి వెళ్లేందుకు యత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు.
బైంసా అల్లర్లు, లవ్ జిహాదీలకు వ్యతిరేకంగా.. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భజరంగ్ దళ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ డీజీపీ కార్యాలయం వద్దకు వచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. అరెస్టులను భజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: 'రాజకీయ బీభత్సం సృష్టించేందుకే ఇలాంటి చర్యలు'