ETV Bharat / state

YSRTP: వైఎస్​ఆర్​టీపీ రిజిస్ట్రేషన్​ కాలేదా! - ysrtp registration

YSRTP: తండ్రి వైఎస్సార్​ ఆశయాల సాధనే లక్ష్యమంటూ వైఎస్​ షర్మిల తెలంగాణలో స్థాపించిన వైఎస్సార్​ తెలంగాణ పార్టీకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. వైఎస్సార్​ తెలంగాణ పార్టీని రిజిస్ట్రేషన్ చేయలేదని భారత ఎన్నికల కమిషన్ పేర్కొన్నట్లు అన్న వైఎస్సార్​ కాంగ్రెస్ పార్టీ నేతలు వెల్లడించారు.

YSRTP: వైఎస్​ షర్మిలకు ఎదురుదెబ్బ.. పార్టీ రిజిస్ట్రేషన్​కు అడ్డంకులు..

author img

By

Published : Jan 12, 2022, 9:23 PM IST

Updated : Jan 13, 2022, 9:03 AM IST

YSRTP: తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల పెట్టిన వైఎస్సార్​ తెలంగాణ పార్టీని రిజిస్ట్రేషన్ చేయలేదని భారత ఎన్నికల కమిషన్ పేర్కొన్నట్లు వైఎస్సార్​ తెలంగాణ పార్టీలో ప్రచారం జరుగుతుంది. అన్న వైఎస్సార్​ కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మహబూబ్ బాషా సమాచార హక్కు చట్టం ద్వారా కోరిన సమాచారానికి భారత ఎన్నికల సంఘం ఈ మేరకు రాత పూర్వకంగా సమాధానమిచ్చినట్లు ఆ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ పేర్కొన్నారు. ఈ విషయం వైఎస్సార్​ తెలంగాణ పార్టీ నేతల దృష్టికి కూడా వచ్చింది.

గతంలో వైఎస్సార్​టీపీ పార్టీ పేరుపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే అన్న వైఎస్సార్​ పేరుతో తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసిన వారు షర్మిల కొత్త పార్టీపై ఈసీకి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్​టీపీ పేరు తమ పార్టీ పేరును పోలి ఉందని అన్న వైఎస్సార్​ పార్టీ అధినేత మహబూబ్ బాషా నవంబర్​లో ఈసీకి ఫిర్యాదు చేశారు. బాషా ఫిర్యాదు స్వీకరించిన ఈసీ.. వైఎస్సార్​టీపీ పేరును పరిశీలిస్తున్నట్లు ప్రకటించింది.

అయితే నేరుగా ఎన్నికల సంఘం నుంచి తమ పార్టీకీ సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని వైఎస్సార్​ తెలంగాణ పార్టీ ముఖ్యనేతలు తెలిపారు. ఎవరికో సమాధానం వస్తే తామెలా స్పందిస్తామని ప్రశ్నించారు. దానికి సంబంధించిన అంశంపై అధికారికంగా స్పందిస్తామని వైఎస్సార్ తెలంగాణ పార్టీ నేతలు తెలిపారు.

ఇదీ చదవండి:

Last Updated : Jan 13, 2022, 9:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.