హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో... దళిత ఉమెన్ నెట్వర్క్-ఎస్సీ, ఎస్టీ బడ్జెట్ మానిటరింగ్ కమిటీ సంయుక్తంగా 'ఎస్సీ, ఎస్టీ చట్టం అమలులో నిర్లక్ష్యం వివక్ష' అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తూ... వారి జీవన ప్రమాణాలను దెబ్బతీస్తున్నారని దళిత ఉమెన్ నెట్వర్క్ కన్వీనర్ విజయ కుమారి ఆరోపించారు.
ఉమ్మడి రాష్ట్రంలో దళిత, గిరిజన సంఘాల మేథావులు, రిటైర్డు అధికారులు... ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్ట సాధన కోసం చేసిన కృషిని రాష్ట్ర ప్రభుత్వం నీరుగారుస్తోందని విజయ కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధులు దళిత మహిళల సంక్షేమానికి వినియోగించాలని దళిత ఉమెన్ నెట్వర్క్ ప్రతినిధి డాక్టర్ ప్రమిళ డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: ఏం చేశారని నిలదీసిన స్థానికుడు... కోపానికొచ్చిన మంత్రి