హైదరాబాద్ మహానగరంలో ఆటోమొబైల్ దుకాణాలు తెరుచుకున్నాయి. లాక్ డౌన్ వల్ల మార్చి 22 నుంచి మూతపడిన దుకాణాలు... ప్రభుత్వ మినహాయింపులతో క్రయవిక్రయాలు ప్రారంభించాయి. రాష్ట్రంలోనే పేరుగాంచిన రాంకోఠిలోని ఆటోమొబైల్ దుకాణాలన్నీ కళకళలాడుతున్నాయి. 57 రోజుల తర్వాత దుకాణాలు తెరిచిన యజమానులు వాటిని శుభ్రపర్చుకున్నారు.
ప్రతి దుకాణం వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది శానిటైజేషన్ చేశారు. యజమానులు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. షాపు ముందు భౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. మాస్కు ధరించకుండా దుకాణానికి వస్తే.. వస్తువులు విక్రయించొద్దని ఆటోమొబైల్ డీలర్స్ ప్రతినిధులు నిర్ణయించుకున్నారు.
ఇదీ చదవండి: ఆర్టీసీ అధికారులతో మంత్రి పువ్వాడ సమీక్ష