బస్తీలో ప్రజలు పడుతున్న కష్టాలను చూడలేక ఆటో డ్రైవర్ లక్ష్మణ్ సమాజ సేవకుడిగా మారారు. హైదరాబాద్ లంగర్ హోస్కు చెందిన లక్ష్మణ్.. ఉదయం 6 గంటల నుంచి 9 వరకు ఆటో నడిపించి.. 10 నుంచి సాయంత్రం 5 వరకు బస్తీలో ఉన్న సమస్యలను తెలుసుకుంటారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని తీరుస్తుంటారు. ఇదే అతని దినచర్య గా మార్చుకున్నారు. 5 నుంచి తిరిగి రాత్రి 10 వరకు ఆటో నడుపుతుంటారు.
వీధి దీపాలు, దోమల పొగ, డ్రైనేజీ క్లీనింగ్, మంచినీటి సమస్య ఇలా ఏ సమస్య ఉన్నా లక్ష్మణ్ వాటిని తక్షణమే పరిష్కరించేలా కృషి చేస్తున్నారు. లక్ష్మణ్ చేస్తున్న పనికి బస్తీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం వచ్చే నాయకులు మాత్రం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఉచిత అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించిన సీపీ మహేశ్ భగవత్