రంజాన్ మాసం చివరి శుక్రవారం రోజున లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు అధికారయంత్రాంగం సమాయత్తమవుతోంది. దీనికి సంబంధించిన బాధ్యతలను నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులకు అప్పగించారు.
అదే రోజున 'జాగ్నే కా రాత్' కూడా ఉండటం వల్ల ఆంక్షలు తప్పకుండా పాటించాలని పోలీసులు చెబుతున్నారు. బహిరంగ ప్రార్థనలకు ఎలాంటి అనుమతి లేదని.. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 42 కరోనా పాజిటివ్ కేసులు.. నలుగురు మృతి