ఏపీలోని గుంటూరు జిల్లాలో తెదేపా కార్యకర్తలపై దాడులు మళ్లీ మొదలయ్యాయి. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో తెదేపా నేత షేక్ చింతపల్లి గౌస్‌పై దాడి జరిగింది. రాళ్లు, కర్రలతో దాడి చేయగా గౌస్ తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు అతనిని పిడుగురాళ్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం గౌస్‌కు ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నందునే దాడి జరిగినట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. గతంలో స్థానిక ఎన్నిక ప్రక్రియ మొదలైన సమయంలో కూడా ఇలాగే దాడులు జరిగాయన్నారు. మళ్లీ ఇప్పుడు ఇలాంటి ఘటనలు పునరావృతం కావటం కారణంగా పల్నాడులో ఆందోళన నెలకొంది.
ఇవీ చదవండి: గుడ్‌న్యూస్: కరోనాను ఎదుర్కోవడం ఇంకాస్త ఈజీ