ETV Bharat / state

రక్త సంబంధాల కంటే చిక్కనైన బంధం మాది: అట్లూరి రామమోహనరావు మనసులో మాటలివి - Atluri Ramamohana Rao friendship with Ramoji Rao

Atluri Rama Mohana Rao: రామోజీ గ్రూపు సంస్థల్లో సుదీర్ఘకాలం ఎండీగా పనిచేసిన అట్లూరి రామమోహనరావు (87) కన్నుమూసిన సంగతి తెలిసిందే. రామోజీ గ్రూపు సంస్థలతో ఆయనది విడదీయలేని బంధం. ఆ బంధం గురించి రామమోహనరావు స్వయంగా పంచుకున్న విశేషాలు.

Atluri Rama Mohana Rao
Atluri Rama Mohana Rao
author img

By

Published : Oct 23, 2022, 7:24 AM IST

Atluri Rama Mohana Rao: రామోజీ గ్రూపు సంస్థల్లో సుదీర్ఘకాలం ఎండీగా పనిచేసి, ‘పెద్ద ఎండీగారి’గా సుప్రసిద్ధులైన అట్లూరి రామమోహనరావు (87) ఇక లేరు. కానీ ఆయన ‘ఈనాడు’ సంస్థలకు అందించిన సేవలు, సిబ్బందితో పంచుకున్న జ్ఞాపకాలు మాత్రం ఎంతో పదిలం. తన స్నేహితుడు, ఛైర్మన్‌ రామోజీరావు 75వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో , రామోజీ సంస్థలతో తనకున్న అనుబంధాన్ని అప్పట్లో పంచుకున్నారిలా!

‘‘ఛైర్మన్ గారిదీ నాదీ ఒకే ఊరు... పెదపారుపూడి. చిన్నప్పట్నుంచీ మంచి స్నేహితులం. కలిసి తిరిగాం. కలిసి పెరిగాం. కలిసే చదువుకున్నాం. కాలేజీ రోజుల్లో మా స్నేహం మరింత బలపడింది. అప్పట్లో మాకు పెద్ద పెద్ద లక్ష్యాల్లేవు. గొప్పగొప్ప కలలూ లేవు. ఎస్‌ఎస్‌ఎల్సీ అయిపోయింది కాబట్టి, ఇంటర్‌లో చేరాం. ఇంటర్ అయిపోయింది కాబట్టి, డిగ్రీలో చేరాం. డిగ్రీ అయిపోయింది కాబట్టి, ఉద్యోగాల వేటలో పడ్డాం. ఛైర్మన్‌గారు దిల్లీ వెళ్లిపోయారు. నాకేమో కార్మికశాఖలో క్లర్కు ఉద్యోగం వచ్చింది. కొంతకాలం తర్వాత గుడివాడ నుంచి బెజవాడకు బదిలీ చేశారు. ఛైర్మన్‌ గారు దిల్లీ నుంచి వస్తున్నారంటే నాకు ఎక్కడలేని సంతోషం. బోలెడన్ని కబుర్లు చెప్పుకొనేవాళ్లం. అంతలోనే నాకు బి.ఎడ్‌లో సీటు వచ్చింది. ఉద్యోగం మానేసి, గుంటూరు ఎ.సి. కళాశాలలో చేరిపోయాను. కోర్సు అయిపోగానే, టీచరుగా కర్నూలులో తొలి పోస్టింగ్. విద్యార్థులు, చదువులు, పాఠాలు, పరీక్షలు, బదిలీలు, పదహారేళ్లపాటు ఉపాధ్యాయ వృత్తే నా ప్రపంచం. ఆ సమయంలో ఛైర్మన్‌గారి జీవితం ఊహించనన్ని మలుపులు తిరిగింది. దిల్లీ నుంచి హైదరాబాద్‌ తిరిగి వచ్చేశారు. వ్యాపారం ప్రారంభించారు. మొదటి నుంచీ ఆయనకు పట్టుదల ఎక్కువ. కొద్దికాలంలోనే వ్యాపారవేత్తగా మంచిపేరు తెచ్చుకున్నారు. ఎవరి లోకాలు వారివైనా మా స్నేహం మాత్రం చెక్కుచెదరలేదు. ‘రారా. నా దగ్గరకు వచ్చెయ్’ అని చాలాసార్లు పిలిచారు. వ్యాపార ఓనమాలు తెలియని రంగంలోకి వెళ్లి ఇబ్బంది పడటం ఎందుకన్నది నా ఆలోచన. ‘ఈనాడు’ ప్రారంభించినప్పుడు మరోసారి పిలిచారు. ‘నీకంత భయంగా ఉంటే, కొన్నాళ్లు సెలవు పెట్టిరా’ అన్నారు. సెలవు పెట్టి వెళ్లడమంటే, విఫలమవుతామేమో అన్న సంకోచంతో రంగంలో దిగడమే. భయం భయంగా నిర్ణయం తీసుకోవడం నాకు నచ్చదు. ఏదో ఒకటి తేల్చుకుందామని, రాజీనామా చేసి వచ్చేశాను. మరుక్షణం నుంచీ ఛైర్మన్ గారే నా జీవితం.

..

ప్రాణస్నేహితుడి పార్థివదేహం వద్ద నివాళులర్పిస్తున్న రామోజీరావు

‘‘భుజాల మీద చేతులేసుకుని గుడివాడ వీధుల్లో తిరిగిన రోజులు గుర్తుకొచ్చినప్పుడు, అంతా కలలా అనిపిస్తుంది. ఇద్దరం కలిసి బోలెడు సినిమాలు చూసేవాళ్లం. ఎన్నో విషయాలు చర్చించుకునేవాళ్లం. చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య వంటి కమ్యూనిస్టు యోధులు ఛైర్మన్‌గారికి చిన్నప్పుడు హీరోలు. ‘వ్యాపారం అంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదు. సామాజిక నిబద్ధత కూడా’ అనేవారాయన. ఇప్పటికీ ఆ మాట మీదే నిలబడ్డారు. సంపాదనే ధ్యేయంగా ఏ వ్యాపారమూ చేయలేదు. కాసుల వర్షం కురిపించే రియల్ ఎస్టేట్‌ రంగాలవైపు కన్నెత్తి కూడా చూడ లేదు. దార్శనికత, సామాజిక నిబద్ధత పునాదులుగా ఆయనో వ్యవస్థను నిర్మించారు. స్పష్టమైన ఆలోచన, లోతైన అధ్యయనం, పక్కా ప్రణాళిక, రాజీలేని ఆచరణ.. ఆయన విధానాలు, కాలు పెట్టిన ప్రతి రంగంలోనూ, వేళ్లూనుకుపోవడం వెనకున్న విజయ రహస్యమూ ఇదే’’

‘‘కళ్ల ముందే మూడున్నర దశాబ్దాలు గడిచిపోయాయి. ఛైర్మన్ గారికి డెబ్బై అయిదేళ్లు. ఆయనకంటే మూడు నెలలు పెద్దవాణ్ణి. ఇన్నేళ్లలో ఛైర్మన్‌గారికి దూరంగా ఉన్నరోజులు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. విజయవాడ వెళ్లినా, విదేశాలకెళ్లినా... నా ఆలోచనలన్నీ ఆయన చుట్టే. వెళ్లేది కూడా విహారానికో విలాసాలకో కాదు. ఛైర్మన్‌గారు అప్పగించిన బాధ్యతల్ని నిర్వర్తించడానికి. వెళ్లిన పని విజయవంతంగా పూర్తిచేసుకుని, ఎప్పుడెప్పుడు ఇక్కడ వాలిపోదామా అన్న ఆలోచనే’’

‘‘దిల్లీ జీవితం ఛైర్మన్‌గారి జీవితంలో తొలిమలుపు. అలా ప్రపంచాన్ని చూశారు. ‘ఈనాడు’ మలిమలుపు. తెలుగు ప్రజలకు అక్షర ప్రపంచం చూపించారు. నా జీవితంలో కూడా ఈనాడే మేలిమలుపు కొత్త పత్రికతోపాటు కొత్త జీవితమూ ప్రారంభమైంది. పదహారేళ్లపాటు బడిపంతులు ఉద్యోగం చేసినవాణ్ని తీసుకొచ్చి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. పాఠాలు చెప్పడం మాత్రమే తెలిసినవాణ్ని. మార్కెటింగ్ పాఠాలు నాకేం తెలుసు? అలా అని వెనక్కి తగ్గలేను. అది ఛైర్మన్‌ గారి ఆదేశం. ‘ధైర్యంగా ముందుకెళ్లాను’ అనడం కంటే, ‘ఆయనే వెనకుండి నడిపించారు’ అంటేనే బావుంటుందేమో! సంస్థకు తగినట్టుగా మనుషుల్ని మలుచుకోవడంలో ఆయన నిపుణులు! ఆ స్థానంలో నేను కాకపోతే మరొకరు, ఇంకొకరు. అంతే అంతకుమించి, నా గురించి నాకు ప్రత్యేకమైన అంచనాల్లేవు. హోదా గురించీ ప్రచారం గురించి కీర్తిప్రతిష్ఠల గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. సొంతంగా ఏదైనా చేసుకోవాలన్న ధ్యాస లేనేలేదు. పని తప్పించి నాకు మరో ప్రపంచమే తెలియదు. కుటుంబమైనా ఆ తర్వాతే. కుటుంబమంటే గుర్తుకొస్తోంది. నా గురించీ నా కుటుంబం గురించి నా కంటే ఛైర్మన్‌గారే ఎక్కువ ఆలోచిస్తారు. ఫిల్మ్ సిటీలో చలి ఎక్కువ. దళసరి చొక్కా వేసుకోమని తరచూ చెప్పేవారు. నేనేమో ఎప్పట్లాగే తలూపి, ఆ సంగతే మరచిపోయేవాణ్ని. ఇక లాభం లేదనుకున్నారేమో, కిరణ్‌తో చెప్పి తెప్పించారు. ఛైర్మన్ గారి కుటుంబంతో నాకున్న అనుబంధాన్ని మాటల్లో చెప్పలేను. ఆయన కొడుకులూ కోడళ్లూ మనవళ్లూ... పెదనాన్న, మావయ్య, తాతగారూ అంటూ ఆప్యాయత కురిపిస్తారు. నా మనవడికి చిన్న ప్రమాదం జరిగితే, ఛైర్మన్ గారి కుటుంబమంతా తల్లడిల్లింది. రక్తసంబంధాలకంటే చిక్కనైన బంధం మాది’’

ఇవీ చదవండి: ఉపాధ్యాయ వృత్తిని వదిలి.. ఈనాడులో అంచెలంచెలుగా ఎదిగి

ప్రాచీన భాషకు ప్రాణం పోస్తున్న అసోం పల్లె వాసులు! సంస్కృతంలోనే మాట్లాడుతున్న గ్రామస్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.