Hyderabad Cricket Association Elections 2023: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని లావు నాగేశ్వరరావుని అసోషియేషన్ సభ్యులు కోరారు. గత హెచ్‌సీఏ అధ్యక్షుడు చేసిన అరాచకాలను ఏకసభ్య కమిటీకి వివరిస్తామని హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు హార్షద్ అయూబ్, మాజీ కార్యదర్శి శేష్ నారాయణ, మాజీ ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్ ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు.
గతంలో సభ్యులను స్టేడియంలోపలికి రానీయ్యకుండా గేట్లకు తాళాలు వేసి అడ్డుకున్నారని హార్షద్ అయూబ్ ఆవేదన వ్యక్తం చేశారు. స్టేడియం బయట టెంట్ వేసుకొని సమావేశం నిర్వహించుకున్నామన్నారు. ఈరోజు స్టేడియం లోపల సమావేశం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ విషయాలన్నింటినీ కమిటీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. హెచ్‌సీఏకు ఎన్నికలు నిర్వహించాలని గుర్తించినందుకు సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీలో హెచ్‌సీఏపై మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడిన అంశంపై తామేమీ మాట్లడలేమన్నారు. ఎన్నికలను పారదర్శకంగా జరిపించాలని కోరారు.
ఈనెల 17న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌పై పలు ఆరోపణలు వస్తోన్నాయి. ఉప్పల్ మ్యాచ్‌లో జరిగిన తప్పిదాలతో, హెచ్‌సీఏ తలనొప్పులు మొదలయ్యాయి. అజహరుద్దీన్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. మ్యాచ్ టికెట్లను పక్కదారి పట్టిస్తున్నారు.
ఆన్‌లైన్ టికెట్లలో గోల్‌మాల్: ఆన్‌లైన్ టికెట్లలో కూడా గోల్‌మాల్ జరిగిందని అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. వర్గ పోరు, అధికార కాంక్షతో హెచ్‌సీఏలో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కానీ ఎన్నికలు జరగాలా వద్దా? అని నిర్ణయించాల్సింది ఎవరు? అసలు ఈ గందరగోళ పరిస్థితికి కారణం ఎవరు? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
ఈ ఎస్‌సీ సభ్యుల్లోనే ఏకాభిప్రాయం లేదన్న విషయం ఇప్పటికే జస్టిస్ కక్రూ నివేదికతో స్పష్టమైంది. అంతే కాకుండా పదవీ కాలం ముగిసినందున అజహరుద్దీన్ అధ్యక్షతన హెచ్‌సీఏలో తీసుకున్న నిర్ణయాలను పక్కన పెడుతున్నట్లూ పేర్కొన్నారు. అయితే ఆ కమిటీని తాజాగా సుప్రీం కోర్టు రద్దు చేసింది.
ఇవీ చదవండి: