ETV Bharat / state

MLC Elections Telangana 2021: త్వరలో మరోమారు ఎన్నికల నగారా.. హైదరాబాద్ మినహా రాష్ట్రం మొత్తం! - తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో త్వరలో మరోమారు ఎన్నికల నగారా మోగనుంది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు(mlc elections telangana 2021) జరగనున్నాయి. హైదరాబాద్ మినహా రాష్ట్రం మొత్తం ఎన్నికలు జరగనున్నాయి. జనవరిలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా వారం, పదిరోజుల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం కనిపిస్తోంది.

mlc elections telangana, telangana mlc elections
రాష్ట్రంలో త్వరలో మరోమారు ఎన్నికల నగారా, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు
author img

By

Published : Nov 5, 2021, 9:27 AM IST

రాష్ట్రంలో పెద్దలసభ ఎన్నికల(mlc elections telangana 2021) హడావిడి ప్రారంభమైంది. శాసనసభ కోటాలో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. ఆరు స్థానాలకు ఎన్నిక కోసం ఈ నెల తొమ్మిదో తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. అవసరమైతే పోలింగ్ 29న నిర్వహించనున్నారు. అయితే ప్రస్తుత శాసనసభ బలాబలాల ప్రకారం చూస్తే పోలింగ్ అవసరం రాకపోవచ్చు. ఆరు స్థానాలను కూడా అధికార తెరాస ఏకగ్రీవంగా కైవసం చేసుకునే పరిస్థితి ఉంది. అదే జరిగితే ఉపసంహరణల గడువు పూర్తైన వెంటనే ఎన్నికను ఏకగ్రీవంగా ప్రకటిస్తారు. అటు స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన 12 స్థానాలు కూడా త్వరలో ఖాళీ కానున్నాయి. స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన పురాణం సతీష్ కుమార్, భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణరావు, భూపాల్ రెడ్డి, సుంకరి రాజు, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, కల్వకుంట్ల కవిత పదవీకాలం జనవరి నాలుగో తేదీతో పూర్తి కానుంది.

తొమ్మిది ఉమ్మడి జిల్లాల నుంచి...

హైదరాబాద్ మినహా మిగతా తొమ్మిది ఉమ్మడి జిల్లాల నుంచి వీరు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల నుంచి రెండు చొప్పున స్థానాలున్నాయి. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల నుంచి ఒక్కో స్థానం చొప్పున ఉన్నాయి. ఈ స్థానాల నుంచి జనవరి నాలుగో తేదీలోగా కొత్త వారిని ఎమ్మెల్సీలుగా ఎన్నుకోవాల్సి ఉంది. ఈ ఎన్నికల(mlc elections telangana 2021) నిర్వహణ కోసం కసరత్తు ప్రారంభించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఆయా జిల్లాల్లోని స్థానిక సంస్థలు, ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు, ఎక్కడైనా ఖాళీలు ఉన్నాయా?... ఉంటే ఏ మేరకు ఉన్నాయి? తదితర వివరాలను ఈసీ పరిశీలిస్తోంది. ఈ మేరకు సంబంధిత సమాచారం పంపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్​ను ఆదేశించింది. నేడో, రేపో ఈ సమాచారం, వివరాలు కేంద్ర ఎన్నికల సంఘానికి చేరనున్నాయి.

వారం, పది రోజుల్లో షెడ్యూల్!

రాష్ట్రంలో అన్ని రకాల స్థానిక సంస్థల ఎన్నికలు గతంలోనే పూర్తయ్యాయి. వివిధ కారణాల రీత్యా అక్కడక్కడా కొన్ని స్థానాలు మాత్రం ఖాళీ అయ్యాయి. నిబంధనల ప్రకారం ఆయా జిల్లాల్లోని స్థానికసంస్థల్లో 75 శాతం ప్రతినిధులు ఎన్నికై ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించవచ్చు. దీంతో ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లోనూ స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు అంటున్నారు. డిసెంబర్ నెలాఖరులోపు ఎన్నికల(mlc elections telangana 2021) ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు సమాచారం. అంటే కనీసం 45 రోజుల ముందు షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారం, పది రోజుల్లో షెడ్యూల్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే హైదరాబాద్ మినహా ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానుంది.

రాష్ట్రంలో త్వరలో మరోమారు ఎన్నికల నగారా

ఇదీ చదవండి: Accident News: ఘోర రోడ్డు ప్రమాదం... అక్కడికక్కడే ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.