హైదరాబాద్ ఆసిఫ్ నగర్ రౌడీ షీటర్ నయీమ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీపావళి పండుగ రోజున అర్ధరాత్రి మెహదీపట్నం రైతు బజార్ పక్కన రెహన్ అలీఖాన్‌కు చెందిన సెల్ ఫోన్ దుకాణంలో మంటలు వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ షాపుకు నయీమ్ నిప్పు అంటించినట్లుగా గుర్తించారు. పాత కక్షల కారణంగానే నిందితుడు ఈ ఘటనకు పాల్పడినట్లు గుర్తించారు. దీపావళి పండుగ రోజు అయితే అతని మీద ఎవరికీ అనుమానం రాకుండా ఉంటుందని భావించాడని పోలీసుల విచారణలో తేలింది. అర్ధ రాత్రి ద్విచక్ర వాహనంలో వచ్చిన నిందితుడు...దుకాణంపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఆసిఫ్ నగర్ రౌడీ షీటర్ నయీమ్ అరెస్ట్ - NAYEEM HYDERBAD ASIF NAGAR ROWDY SHEETER ARRESTED
పాత క్షక్షలో భాగంగా ఓ సెల్ ఫోన్ దుకాణంలో మంటలకు కారణమైన పాత రౌడీ షీటర్ నయీమ్‌ను హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు.