ETV Bharat / state

Police help: అమ్మ కష్టాన్ని చూసి.. ఆసరాగా నిలిచిన పోలీసు

author img

By

Published : Jun 1, 2021, 1:43 PM IST

హైదరాబాద్ రేతిబౌలి వద్ద నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధురాలిని గమనించిన ఆసిఫ్ నగర్ సీఐ ఆమెకు సాయం చేశాడు. లాక్​డౌన్ సడలింపు సమయం పూర్తయినందున ఆమెను పోలీసు వాహనంలో గమ్యస్థానానికి చేర్చాడు.

Asif Nagar CI helped to an old women
నిస్సహాయ వృద్ధురాలికి సాయం చేసిన ఆసిఫ్ నగర్ సీఐ

హైదరాబాద్​ మెహదీపట్నం రేతిబౌలి వద్ద ఎండకు ఆయాసపడుతునే.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది ఓ వృద్ధురాలు. నడిచేందుకు ఓపికలేకపోయినా ఆమె ముందుకు వెళ్తునే ఉంది. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆసిఫ్ నగర్ సీఐ నాగం రవీందర్ ఈ విషయాన్ని గమనించారు. ఆ వృద్ధురాలిని ఆపి ఆమెతో కాసేపు మాట్లాడారు. తన పేరు లక్ష్మి అని.. కరీంనగర్ జిల్లా మానకోడూరు తమ సొంత ఊరని తెలిపింది. కొడుకు అజయ్ క్యాన్సరతో బాధపడుతున్నాడని.. ప్రస్తుతం నాంపల్లిలోని క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పింది.

వెయ్యి రూపాయల కోసమే..

వైద్యం కోసం తను తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయని.. చేతిలో చిల్లిగవ్వ లేక బంధువుల సాయం కోరినట్లు సీఐతో వివరించింది. రాజేంద్రనగర్, ఆరెమైసమ్మ ప్రాంతంలో నివాసముండే తన బంధువులు 1000 రూపాయలు ఇస్తామన్నారని అందుకే వాళ్లని కలిసేందుకు వెళ్తున్నట్లు తెలిపింది. మెహదీపట్నం చేరుకోగానే లాక్​డౌన్ సడలింపు సమయం పూర్తయినందున ఒంట్లో శక్తి లేకపోయినా కొడుకు వైద్యం కోసం నడక ప్రారంభించానని చెప్పింది. ఆమె బాధని విని కరిగిపోయిన సీఐ రవీందర్ వెంటనే ఆమెకు తాగునీరు, గ్లూకోజ్ అందించారు.

నా కొడుక్కు పండ్ల రసం తీసుకెళ్తా..

తన జేబులోంచి రెండు వేల రూపాయలు తీసి ఆమె చేతిలో పెట్టాడు. ఆమె ముఖంలో పట్టలేని ఆనందాన్ని చూసి సీఐ భావోద్వేగానికి గురయ్యారు. మంచం మీద ఉన్న తన కొడుకు పండ్ల రసం కావాలని అడుగుతున్నాడని.. ఈ డబ్బుతో కొడుకు జ్యూస్ కొని తీసుకెళ్తానని సీఐకి లక్ష్మి తెలిపింది. ఆరె మైసమ్మ ప్రాంతానికి వెళ్లడం చాలా కష్టమని... లక్ష్మికి నచ్చజెప్పాడు. నేరుగా ఆస్పత్రికి వెళ్లమని సూచించాడు. వెంటనే సిబ్బందిని పిలిపించి లక్ష్మిని పోలీసు వాహనంలో క్యాన్సర్ ఆస్పత్రి వద్దకు పంపించాడు.

ఇదీ చదవండి : Diagnostics: కరోనా నిర్ధారణ పరీక్షకు వెళ్తే నిలువు దోపిడీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.