DK Aruna's response to giving ED notices to Rohit Reddy: ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇవ్వడంలో భాజపాకు ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసు వారిపై ఇప్పటికే నడుస్తోందని కొత్తగా తెరిచిన కేసు కాదన్నారు. ఊరికే ఎందుకు నోటీసులు ఇస్తారని.. వారు తప్పు చేయకుంటే భయమెందుకని ప్రశ్నించారు.
ఫామ్ హౌజ్ కేసు దొంగ కేసు అని అందరికీ తెలుసన్నారు. లిక్కర్ స్కామ్లో కవిత పేరు వెలుగులోకి వచ్చాకే ఫామ్ హౌజ్ కేసు బయటకు వచ్చిందన్నారు. కక్ష సాధింపులు కేసీఆర్ కుటుంబానికి అలవాటేనని.. కానీ భాజపాలో అలాంటివి ఉండవన్నారు. ముఖ్యమంత్రి ఏ డ్రామా చేయమంటే.. ఆ డ్రామా చేశారు కాబట్టి నలుగురు ఎమ్మెల్యేలు కేసీఆర్కు హీరోలు, ఆణిముత్యాలు అయ్యారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలను ఎందుకు ప్రగతి భవన్లో బంధించారని ఆమె ప్రశ్నించారు. అవినీతి ఎక్కడ ఉంటే అక్కడికి ఈడీ వస్తుందన్నారు.
అసలు ఏమి జరిగిందంటే: తాండూరు శాసన సభ్యుడు పైలెట్ రోహిత్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19వ తేదీన విచారణ హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. ఈడీ నుంచి నోటీసులు అందాయని పైలెట్ రెడ్డి నిర్ధరించారు.
ఇవీ చదవండి: