ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల సమ్మె మూడో రోజుకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా మూడురోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. సేవల నిలుపుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్ మొదలుకొని... గుండెకు స్టంట్ వరకు నిరుపేదలు అనేక వైద్య సేవలు పొందేవారు. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆ సేవలు నిలిపివేయడంతో...రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యకు ఓ పరిష్కారాన్ని చూపాల్సిన అవసరం ఉందని రోగులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: వరద ముంచెత్తింది... ఊరు రోడ్డున పడింది!