ETV Bharat / state

టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలపై సిట్​ ఏర్పాటు.. తీర్పు రిజర్వ్​ చేసిన సుప్రీంకోర్టు - supreme latest news

Supreme Court ON SIT : తెలుగుదేశం ప్రభుత్వ నిర్ణయాలపై సిట్‌ ఏర్పాటు అంశంలో సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ విషయంలో ఏపీ రాష్ట్ర హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలంటూ ఏపీ ప్రభుత్వం గతంలో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. వాదనలను ముగించి తీర్పును రిజర్వ్‌ చేసింది.

Supreme Court ON SIT
సుప్రీంకోర్టు
author img

By

Published : Nov 17, 2022, 5:24 PM IST

Supreme Court ON SIT : తెలుగుదేశం ప్రభుత్వనిర్ణయాలపై సిట్‌ ఏర్పాటును కొనసాగించాలంటూ ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. సిట్ ఏర్పాటుపై హైకోర్టు విధించిన 'స్టే' ఎత్తివేసి తదుపరి విచారణకు అనుమతి ఇవ్వాలని వేసిన పిటిషన్‌పై.. రెండోరోజు సుప్రీంలో సుదీర్ఘ వాదనలు జరిగాయి. టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ తరపున సీనియర్‌ న్యాయవాది సిద్దార్ధ దవే, రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ వాదనలు వినిపించారు.

సీఐడీ రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిందని దవే కోర్టుకు తెలపగా.. విస్మయం వ్యక్తం చేసిన సుప్రీం ధర్మాసనం.. హైకోర్టు స్టే విధించినా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం ఏంటని ప్రశ్నించింది. 2020 మార్చి 20న సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాలకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే.. కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా రాలేదని న్యాయవాది తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంపై ఒక్క పిటిషన్ కూడా దాఖలు చేయలేదని, అధికారంలోకి రాగానే టీడీపీ ప్రభుత్వం ప్రతి నిర్ణయాన్ని పున:సమీక్షించాలని జగన్ ప్రభుత్వం భావిస్తోందన్నారు.

నిజానిజాలు తెలుసుకోవడానికి కమిటీ వేసి, మాజీ న్యాయమూర్తి చేత విచారణ జరిపితే అభ్యంతరం లేదని న్యాయస్థానానికి తెలిపారు. నిజ నిర్ధారణ కోసం కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయవచ్చునని, సిట్‌ వేయాల్సిన అవసరం కనిపించలేదని న్యాయవాది వెల్లడించారు. రాజకీయ కక్ష సాధింపుల కోసమే సిట్‌ ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తున్నట్లు సిద్ధార్ధ దవే న్యాయస్థానానికి స్పష్టం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ ఎంఎం సుందరేష్‌ల ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.