ETV Bharat / state

అభిశంసన ఉత్తర్వులు తిప్పి పంపిన ప్రభుత్వం - ap political news

ఏపీ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్​ గిరిజాశంకర్​పై జారీ చేసిన సెన్సూర్ ప్రొసీడింగ్స్​ను ఆరాష్ట్రప్రభుత్వం ఎస్ఈసీకి తిప్పిపంపింది.

వివేది, గిరిజా శంకర్‌పై సెన్సూర్ ప్రొసీడింగ్స్‌ను ఎస్‌ఈసీకి తిప్పిపంపిన ఏపీ ప్రభుత్వం

author img

By

Published : Jan 27, 2021, 10:22 PM IST

Updated : Jan 27, 2021, 10:38 PM IST

పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్​ గిరిజాశంకర్​పై జారీ చేసిన సెన్సూర్ ప్రొసీడింగ్స్​ను ఏపీ ప్రభుత్వం ఎస్ఈసీకి తిప్పిపంపింది. అఖిలభారత సర్వీసు అధికారులపై సెన్సూర్ ప్రొసీడింగ్స్​ను జారీ చేసే అధికారం ఎస్ఈసీకి లేదని సీఎస్ కార్యాలయం అభ్యంతరం వ్యక్తం చేసింది. అధికారుల నుంచి వివరణ కోరేలా నోటీసు కూడా జారీ చేయకుండా సెన్సూర్ ప్రోసీడింగ్స్​ను ఎవరూ జారీ చేయలేరని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసును కూడా ఎస్ఈసీ ఇవ్వలేదని.. వారి నుంచి సంబంధిత అభియోగాలకు వివరణ తీసుకోకుండా ఈ ప్రొసీడింగ్స్​ను జారీ చేయలేరని పేర్కొంది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్​ గిరిజాశంకర్... ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించారని పేర్కొంటూ ఎస్ఈసీ సెన్సూర్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. వారి సర్వీసు రికార్డుల్లో ఈ రిమార్కులు నమోదు చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ 9 పేజీల ప్రోసీడింగ్స్​ను ఇచ్చారు. వీటిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు కూడా పంపించారు.

ఇదీ చదవండి: పీఆర్సీ నివేదికపై భగ్గుమన్న ఉద్యోగ సంఘాలు..

Last Updated : Jan 27, 2021, 10:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.