ETV Bharat / state

హైదరాబాద్​లో పర్యటించిన ఏపీ అధికారుల బృందం - telangana latest news

ఆంధ్రప్రదేశ్​ మున్సిపల్​ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి నేతృత్వంలోని బృందం హైదరాబాద్​లో పర్యటించింది. జీహెచ్​ఎంసీ పరిధిలో అమలవుతున్న స్వచ్ఛ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను సందర్శించింది. జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేశ్​కుమార్​తో సమావేశమయ్యారు.

ap municipal officials visit to Hyderabad
హైదరాబాద్​లో పర్యటించిన ఏపీ అధికారుల బృందం
author img

By

Published : Feb 2, 2021, 5:27 AM IST

ఏపీ పురపాలక శాఖ ఉన్నతాధికారులు హైదరాబాద్​లో పర్యటించారు. గ్రేటర్​లో అమలవుతున్న స్వచ్ఛ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను పరిశీలించారు.

ఏపీ మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో 23 మంది సీనియర్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ల బృందం జీహెచ్ఎంసీ కమిషనర్​తో సమావేశమైంది. ఈ సందర్బంగా జీహెచ్ఎంసీలో అమలవుతున్న కార్యక్రమాలను.. పవర్​ పాయింట్ ప్రజెంటేషన్​ ద్వారా కమిషనర్ లోకేశ్​కుమార్​ వివరించారు.

అనంతరం ఇందిరాపార్క్​లోని పంచతంత్ర పార్క్, సంజీవయ్య పార్క్ సమీపంలోని సెకండరీ కలెక్షన్ కేంద్రం, హెర్బల్ పార్క్, తార్నాకలోని స్మార్ట్ బస్​స్టేషన్, ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలోని లో-కేఫ్, మొబైల్ టాయిలెట్, గచ్చిబౌలిలో పాలపిట్ట సైక్లింగ్ ట్రాక్, డాగ్​ పార్క్, దుర్గం చెరువు సుందరీకరణ పనులు, సనత్​నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, జూబ్లీహిల్స్​లోని వాటర్ హార్వెస్టింగ్ థీమ్​ పార్క్, అంబర్​పేట్​లోని సీవరేజ్ ట్రీట్​మెంట్ ప్లాంట్​లను అధికారుల బృందం సందర్శించింది.

ఇవీచూడండి: జూన్​లోగా సీతారామ ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేయాలి: రజత్ కుమార్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.