ETV Bharat / state

AP Cabinet meeting: పీఆర్సీ జీవోలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం - AP Cabinet meeting news

AP Cabinet meeting
ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం
author img

By

Published : Jan 21, 2022, 2:12 PM IST

Updated : Jan 21, 2022, 2:24 PM IST

14:10 January 21

ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం.. పీఆర్సీ జీవోలకు ఆమోదం

ap Cabinet meeting: ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలపై కేబినెట్‌ భేటీలో చర్చించారు.

ap cabinet decisions: ఇటీవల ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీవోలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు, కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.

ఆమోదముద్ర వేసింది వీటికే...

  • కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు
  • గ్రామ, వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాలపై ఆమోదం
  • ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల పథకానికి మంత్రివర్గం ఆమోదం
  • జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లలో 10 శాతం ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయింపు
  • ఉద్యోగులకు 20 శాతం రిబేట్, పెన్షనర్లకు 5 శాతం ప్లాట్లు కేటాయింపు
  • ఈబీసీ నేస్తం అమలుకు మంత్రివర్గం ఆమోదం
  • వారానికి 4 సర్వీసులు నడిపేలా ఇండిగో ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందానికి ఆమోదం
  • రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏడాది పాటు అమలులో ఒప్పందం
  • ఒప్పందం అమలుకు రూ.20 కోట్లు చెల్లించేలా మంత్రివర్గం ఆమోదం

ఇదీ చూడండి: 'ప్రేమించి దగ్గరయ్యాడు.. పెళ్లంటే వీడియోలు బయట పెడతానంటున్నాడు..'

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 21, 2022, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.