ETV Bharat / state

'వచ్చే ఎన్నికల్లో ఏపీలో కచ్చితంగా అధికారంలోకి వస్తాం' - somu veerraju news

ఆంధ్రప్రదేశ్​లో భాజపా అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. మంచి పాలన అందించి.. ఏపీని అభివృద్ధి చెయ్యడమే భాజపా లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రాజధాని రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాల్సిందేనని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

ap-bjp-president-somu-veerraju-comments-on-coming-elections
'వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్​లో కచ్చితంగా అధికారంలోకి వస్తాం'
author img

By

Published : Aug 11, 2020, 7:36 PM IST

ఆంధ్రప్రదేశ్​లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. జాతీయ వాదంతో కూడిన రాజకీయ వ్యవస్థ ఏపీకి కావాలన్నారు. భాజపా రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఆయన కన్నా లక్ష్మీనారాయణ నుంచి బాధ్యతలు స్వీకరించారు. భాజపా - జనసేన కూటమి నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణే భాజపా విధానమని.. ఏపీలో మోదీయిజంను స్థాపించడమే పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. రెండు కుటుంబ పార్టీల మధ్య ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుందని వ్యాఖ్యానించారు.

'వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్​లో కచ్చితంగా అధికారంలోకి వస్తాం'

తెదేపా, వైకాపా రెండూ సామాజిక సమతుల్యం అని పేరుకు చెబుతారు తప్ప.. ఎవరికీ అధికారం ఇవ్వరని సోము వీర్రాజు విమర్శించారు. ప్రస్తుత హోం మంత్రి ఒక డీఎస్పీని బదిలీ చేయగలరా అని ప్రశ్నించారు. మంచి పాలన, అభివృద్ధి ఇవ్వాలనేది భాజపా లక్ష్యమన్న ఆయన... అవినీతికి పాల్పడితే సహించబోమన్నారు.

జగన్​ ప్రభుత్వం అమరావతి రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనని సోమువీర్రాజు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో భాజపా - జనసేన కలిసి ఆంధ్రప్రదేశ్​లో అధికారంలోకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి.. హైదరాబాద్ ప్రజల భయాందోళనపై నిపుణులు ఏం చెప్పారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.