ETV Bharat / state

కరోనా విరుగుడుకు గుర్రాల యాంటీబాడీస్ - సీసీఎంబీ, హెచ్‌సీయూతో విన్స్‌ బయోప్రొడక్ట్స్‌ కంపెనీ ఒప్పందం

కొవిడ్​-19 వ్యాధి నివారణ చికిత్సకు గుర్రాల నుంచి యాంటీబాడీస్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ మేరకు వాటి తయారీకి హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, సీసీఎంబీ, విన్స్‌ బయోప్రొడక్ట్స్‌ కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. త్వరలోనే యాంటీవైరల్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని వైద్య నిపుణులు చెబుతున్నారు.

antibodies developed from horses treat corona at hyderabad
హైదరాబాద్​లో కరోనా చికిత్సకు గుర్రాల నుంచి మందు
author img

By

Published : May 16, 2020, 3:49 PM IST

కరోనా వైరస్‌ చికిత్సకు యాంటీబాడీలను వినియోగించవచ్చని అధ్యయనాలు నిరూపిస్తున్న నేపథ్యంలో వీటి తయారీకి హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ), సీసీఎంబీ, విన్స్‌ బయోప్రొడక్ట్స్‌ కంపెనీ చేతులు కలిపాయి. ఈ మేరకు సీసీఎంబీ, హెచ్‌సీయూతో విన్స్‌ బయోప్రొడక్ట్స్‌ కంపెనీ శుక్రవారం ఒప్పందం చేసుకుంది. సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా, హెచ్‌సీయూ రిజిస్ట్రార్‌ సర్దార్‌సింగ్‌, విన్స్‌ సీఈవో సిద్ధార్థ్‌ ఈ మేరకు పత్రాలపై సంతకం చేశారు. తాజా ఒప్పందంలో భాగంగా సీసీఎంబీ తరఫున వైరస్‌ కల్చర్‌ను అందిస్తారు. హెచ్‌సీయూ సాంకేతికతను సమకూరుస్తుంది.

గుర్రాలలో యాంటీబాడీస్‌

అచేతన కరోనా వైరస్‌ను ఉపయోగించి గుర్రాలలో యాంటీబాడీస్‌ను వృద్ధిచేస్తారు. వాటిని శుద్ధి చేసి కరోనా చికిత్సకు అందిస్తారు. ఈ విధానంలో తక్కువ ఖర్చుతోనే భారీ మొత్తంలో యాంటీబాడీస్‌ను తయారు చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. హెచ్‌సీయూలోని పరిశోధక బృందానికి యానిమల్‌ బయోటెక్నాలజీ ఆచార్యుడు డాక్టర్‌ నూరుద్దీన్‌ ఖాన్‌ నాయకత్వం వహిస్తారు. సీసీఎంబీ తరఫున ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ కృష్ణన్‌ హరినివాస్‌, విన్స్‌ కంపెనీ తరఫున డాక్టర్‌ కృష్ణమోహన్‌ భాగస్వాములవుతారు.

ఈ విధానంలో తయారుచేసిన యాంటీ బాడీస్‌ సమర్థంగా పనిచేయడం వల్ల రోగులపై దుష్ప్రభావాలు చూపవని హెచ్‌సీయూ వీసీ ప్రొఫెసర్‌ పొదిలె అప్పారావు తెలిపారు. మూడు సంస్థల్లోని సాంకేతికత, వసతులను వినియోగించుకుని అతి త్వరలోనే యాంటీవైరల్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని విన్స్‌ బయోప్రొడక్ట్స్‌ సీఈవో సిద్ధార్థ్‌ దాగా అన్నారు.

ఇదీ చూడండి : దయనీయంగా మారిన వృద్ధాశ్రమాల పరిస్థితి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.