ETV Bharat / state

Foreign Investment: జీనోమ్​ వ్యాలీలో భారీ మొత్తంలో కెనడా కంపెనీ పెట్టుబడి - తెలంగాణ తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రానికి మరో విదేశీ భారీ (Foreign Investment) పెట్టుబడి వరించింది. కెనడాకు చెందిన ఇవాన్ హో కేంబ్రిడ్జ్ అండ్ లైట్ హౌస్ కాంటన్.. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో కంపెనీ భారీ ల్యాబ్ స్పేస్​ను తీసుకునేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు జీనోమ్ వ్యాలీలో (Genome Valley) సుమారు 100 మిలియన్ డాలర్లు (సుమారు 740కోట్లు) పెట్టుబడి పెడుతున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Foreign Investment
Foreign Investment
author img

By

Published : Jul 7, 2021, 1:01 PM IST

తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు మరో కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. జీనోమ్ వ్యాలీలో (Genome Valley) కంపెనీ భారీ ల్యాబ్ స్పేస్​ను తీసుకునేందుకు ముందుకొచ్చింది. సుమారు సుమారు రూ.740కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ల్యాబ్​ విస్తీర్ణంలో సుమారు 10 లక్షల చదరపు అడుగుల ఆక్యుపెన్సీతో ఈ పెట్టుబడిని వినియోగించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆ కంపెనీ భారత ప్రతినిధులు.. చాణక్య చక్రవర్తి, శిల్పి చౌదరి, హరే కృష్ణ, సంకేత్ సిన్హాతో కూడిన బృందం మంత్రి కేటీఆర్​తో జరిగిన సమావేశంలో ప్రకటించారు.

GENOME VALLEY
మంత్రి కేటీఆర్​తో వర్చువల్​గా సమావేశమైన ఇవాన్ హో కేంబ్రిడ్జ్ సంస్థ ప్రతినిధులు

లైఫ్ సైన్సెస్ రంగంలో ఒక ప్రముఖ కెనెడియన్ ఫండ్ దక్షిణాసియాలో మొదటిసారిగా ఇంత భారీ మొత్తంలో పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపింది. లైఫ్ సైన్సెస్ రంగ మౌలిక వసతుల కల్పనలో ఇవాన్ హో కేంబ్రిడ్జ్ భారీ పెట్టుబడి ఒక మైలురాయిగా నిలిచిపోతుందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (ktr) అన్నారు. దేశంలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ రంగ పరిశోధన అభివృద్ధి క్లస్టర్ అయిన జీనోమ్ వ్యాలీలో ఇప్పటికే 200కు పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని... తాజాగా ఈ పెట్టుబడి ద్వారా ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ రంగ విజన్​కు మరింత ఊతం లభిస్తుందన్నారు. ఈ పెట్టుబడి ద్వారా జీనోమ్ వ్యాలీలో మరింత లేబొరేటరీ స్పేస్ పెరగుతుందని మంత్రి పేర్కొన్నారు. దీనితో పాటు రానున్న కాలంలో పరిశోధన, అభివృద్ధి, లైఫ్ సైన్సెస్ అనుబంధ మౌలిక వసతులు మరింతగా పెరుగుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్న ట్రైటాన్​

ఈ మధ్య కాలంలో రాష్ట్రానికి పెద్ద మొత్తంలో విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి. ఇటీవల ఈవీ రంగంలో దిగ్గజ కంపెనీగా పేరొందిన ట్రైటాన్(triton) ఈవీ, తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో సూమారు రూ. 2,100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి: ఎలక్ట్రానిక్‌ వాహనాల రంగంలో రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.