ప్రజల కోసం పోరాడే వారిని సన్మానించుకోవాల్సిన అవసరముందని.. శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. సామాజిక బాధ్యతను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. హైదరాబాద్‌లోని.. శ్రీ త్యాగరాయ గాన సభలో శ్రుతి లయ ఆర్ట్స్‌అకాడమి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
కొవిడ్ సమయంలో సేవలందించి.. 'ప్రైడ్ ఆఫ్ ఇండియా' అవార్డు అందుకున్న అనూహ్య రెడ్డిని.. సంస్థ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఆమెను.. 'సేవా సామ్రాజ్ఞి' బిరుదుతో సత్కారించారు. ఈ కార్యక్రమంలో.. మానవ హక్కుల కమిషన్ సభ్యుడు జస్టిస్ చంద్రయ్య, భాజపా మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి: సీఎస్ సోమేశ్‌కుమార్