ETV Bharat / state

చిన్నారిని లోపల ఉంచి అంగన్వాడీకి తాళం.. 7 గంటల పాటు..

Teacher Locked a student in sangareddy Anganwadi Center: అంగన్వాడీ కేంద్రంలో చిన్నారిని ఉంచి టీచర్​ తాళం వేసి వెళ్లిపోయిన సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. తమ కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు బొల్లారం పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది.

author img

By

Published : Mar 1, 2023, 1:19 PM IST

child
చిన్నారి అదృశ్యం
చిన్నారిని లోపల ఉంచి అంగన్వాడీకి తాళం

Teacher Locked a student in sangareddy Anganwadi Center: చిన్నారి గదిలో ఉండగానే అంగన్వాడీ టీచర్లు తాళం వేసి వెళ్లిపోయిన సంఘటన సంగారెడ్డి జిల్లా కాజీపల్లిలో జరిగింది. బాలిక కనిపించకపోవడంతో బొల్లారం పోలీస్​ స్టేషన్​లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాలిక ఆచూకీ గురించి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడేళ్ల చిన్నారి అవంతిక కాజీపల్లి అంగన్వాడీ కేంద్రంలో చదువుతోంది. రోజులాగే అంగన్వాడీకి పంపిన తల్లిదండ్రులు రాత్రైనా విద్యార్థి ఇంటికి తిరిగి రాకపోవడంతో అంతటా గాలించారు. ఎంతకీ ఆచూకీ లభించక చివరకుఐడియా బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు.. చుట్టు పక్కల పాప ఆచూకీ గురించి ఆరా తీశారు.

ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికినా.. ఆచూకీ దొరకకపోవడంతో అనుమానం వచ్చి అంగన్వాడీ కేంద్రానికి సమీపంలో ఉన్న సీసీ టీవీ పుటేజ్​లను పరిశీలించారు. అయితే ఆ బాలిక అంగన్వాడీ కేంద్రం నుంచి బయటకు వచ్చినట్లు ఎక్కడా కనిపించకపోవడంతో.. రాత్రి 10 గంటల సమయానికి ఆ కేంద్రం తలుపులు తెరిచి పోలీసులు చూశారు. అక్కడే లోపల ఓ మూలన ఉన్న బాలికలను పోలీసులు గుర్తించారు. వెంటనే వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తమ చిన్నారిని వెతికిపెట్టిన పోలీసులకు బాలిక తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెప్పారు. వెంటనే బాధ్యులైన అంగన్వాడీ టీచర్లపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్​ చేశారు. పాపకు ఏమైనా అయితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

మూసాపేట్​లో విద్యార్థి అదృశ్యం: మరోవైపు హైదరాబాద్​ నగరంలోని మూసాపేట్​లో ఐదో తరగతి విద్యార్థి అదృశ్యమయ్యాడు. మంగళవారం రోజున పాఠశాలకు వెళ్లి ఇంటికి తిరిగిరాలేదని..స్థానిక పోలీస్​ స్టేషన్​లో బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు సమీపంలోని పాఠశాలకు చేరుకుని.. అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

ఇంటర్​ విద్యార్థి ఆత్మహత్య: కళాశాల యాజమాన్యం పెట్టే ఒత్తిడి తట్టుకోలేక.. రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలోని శ్రీచైతన్య కళాశాల విద్యార్థి సాత్విక్​ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే తోటి విద్యార్థులు ఆస్పత్రికి తీసుకెళ్లిన.. ప్రాణాలు మాత్రం దక్కలేదు. సాత్విక్​ మృతికి కళాశాల యాజమాన్యమే కారణమని.. విద్యార్థులు, సాత్విక్​ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీరియస్​ అయ్యారు. వెంటనే ఈ విషయంపై విచారణ చేపట్టాలని విద్యాశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్​ను ఆదేశించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.