Retired Employee cracks gate: ఉన్నత చదువులకు వయసు అడ్డుకాదు. ఉద్యోగం చేస్తూ కూడా చదివేవారు ఎందరో ఉన్నారు. అయితే.. ఉద్యోగ విరమణ చేసిన తరువాత కూడా ఉన్నత చదువులు అభ్యసించేవారు మాత్రం అరుదు. ఏపీలోని అనంతపురానికి చెందిన వి.సత్యనారాయణరెడ్డి ఇంజినీరుగా ఉద్యోగ విరమణ చేసిన తరువాత జేఎన్‌టీయూలో ఎంటెక్ చేశారు. గేట్ పరీక్షలో జాతీయస్థాయిలో 140వ ర్యాంకు సాధించి ఔరా అనిపించుకున్నారు.
పంచాయతీరాజ్ శాఖలో ఇంజినీరుగా 39 ఏళ్లు పనిచేశారు. డీఈఈగా 2018లో ఉద్యోగ విరమణ చేశారు. 2019లో జేఎన్‌టీయూ సివిల్ విభాగంలో ఎంటెక్‌లో చేరి 2022లో పూర్తి చేశారు. 2022 గేట్ పరీక్షలోని జియోమోటిక్స్ ఇంజినీరింగ్ పేపరులో 140వ ర్యాంకు సాధించారు. ఆయన వయసు ప్రస్తుతం 64 సంవత్సరాలు. ఆయనకు ఇద్దరు కుమారులు. మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు.
గేట్ సాధించిన అభ్యర్థులు ఉన్నత విద్యలో ప్రవేశానికి 3 సంవత్సరాలపాటు అవకాశం ఉంటుందని సత్యనారాయణ తెలిపారు. కుటుంబసభ్యులతో చర్చించి బాంబే లేదా రౌర్కెలాలోని ఐఐటీలో జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్), రిమోట్ సెన్సింగ్ కోర్సులో చేరాలని భావిస్తున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: