ETV Bharat / state

మాదిగ హక్కుల పరిరక్షణకే దండోరా సంఘం: యాతాకుల భాస్కర్

మాదిగ హక్కుల పరిరక్షణకు దండోరా పేరిట సంఘాన్ని ఏర్పాటు చేశామని వ్యవస్థాపకుడు యాతాకుల భాస్కర్ పేర్కొన్నారు. విద్యా, ఉద్యోగ, సంక్షేమంలో దక్కాల్సిన వాటా కోసం ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. బాగ్‌లింగంపల్లిలోని వీఎస్‌టీ యూనియన్ కార్యాలయంలో ఎంహెచ్‌డీ లోగో ఆవిష్కరించినట్లు తెలిపారు.

author img

By

Published : Feb 27, 2021, 7:55 PM IST

An association called Dandora was formed to protect the rights of Madiga
మాదిగ హక్కుల దండోరా లోగో ఆవిష్కరణ

సమాజంలో మాదిగ హక్కుల పరిరక్షణ, విద్యా, ఉద్యోగ సంక్షేమ పథకాల్లో తమకు దక్కాల్సిన వాటా కోసం నిర్మాణాత్మక ప్రణాళికతో ముందుకు సాగాలని మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపకుడు యాతాకుల భాస్కర్ అన్నారు. మాదిగల వర్గీకరణ అంశం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిధిలో ఉందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో మాదిగ హక్కుల పరిరక్షణకు దండోరా పేరిట సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని వీఎస్‌టీ యూనియన్ కార్యాలయంలో ఎంహెచ్‌డీ లోగో ఆవిష్కరించారు.

మాదిగలకు ప్రధానంగా మూడెకరాల భూమి, విద్యా, ఉద్యోగ, సంక్షేమంలో వాటా, తదితర అంశాల సాధనకు వేదిక ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ఇదీ చూడండి: 'మంత్రి కేటీఆర్ సహాయం ఎప్పటికీ మర్చిపోలేం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.