జుట్టుకు సంబంధించిన ఎలాంటి సమస్య అయినా కలబందతో పరిష్కారమైపోతుంది. చుండ్రు, పొడిబారడం, నిర్జీవంగా మారడం, రాలిపోవడం వంటి సమస్యలకు కలబంద మంచి ఔషధం. తలస్నానం చేయడానికి పది నిమిషాల ముందు కలబంద గుజ్జులో ఒక చెంచా ఆలివ్ నూనె కలిపి కుదుళ్లతో సహా పట్టించాలి. ఈ జెల్లోని ఎంజైములు తలపై ఉన్న మృత కణాలను తొలగించి.. చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌ని తొలగిస్తాయి. పీహెచ్ స్థాయిలను పెంచి జుట్టుకు కావల్సిన తేమను అందించి జుట్టు పొడిబారకుండా చేస్తాయి.
జుట్టు నుంచి వెలువడే సహజసిద్ధమైన నూనెల్లో ఆమైనో ఆమ్లాలు ఉంటాయి. అవి జుట్టు ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతాయి. కలబందలో కూడా అలాంటి ఆమ్లాలు దాదాపు ఇరవై రకాలు ఉంటాయి. కలబంద గుజ్జును జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు బలంగా, ఆరోగ్యంగా ఎదుగుతుంది. జుట్టు రాలే సమస్యకు కూడా కలబందతో చెక్ పెట్టొచ్చు. కలబంద గుజ్జులో పావుకప్పు ఉసిరిపొడి, రెండు చెంచాల బాదం నూనె క లిపి తలకు ప్యాక్‌లా వేసుకోవాలి. ఇలా చేస్తే.. మంచి ఫలితాలుంటాయి. అంతేకాదు.. మందార పూలను మెత్తగా చేసి.. కలబంద గుజ్జులో కలిపి తలకు రాసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే.. జుట్టు తళతళ మెరుస్తుంది.
ఇదీ చదవండి: దేశంలో ఏ పార్టీకి లేని పటిష్ఠమైన యంత్రాంగం తెరాసకు ఉంది: కేటీఆర్