ETV Bharat / state

ప్రభుత్వ భూముల వేలానికి రంగం సిద్ధం.. త్వరలో నోటిఫికేషన్! - government lands auction

రాష్ట్రంలో ప్రభుత్వ భూముల వేలానికి రంగం సిద్ధమైంది. మొదటి దఫా వేలానికి ఒకటి, రెండు రోజుల్లోనే నోటిఫికేషన్ జారీ కానుంది. కోకాపేట ప్రాంతంలో ఉన్న హెచ్​ఎండీఏకు చెందిన భూములను మొదటగా విక్రయించాలని, ఆ తర్వాత స్పందనను బట్టి మిగతా భూముల అమ్మకాన్ని చేపట్టాలని భావిస్తున్నారు.

ప్రభుత్వ భూముల వేలానికి రంగం సిద్ధం
ప్రభుత్వ భూముల వేలానికి రంగం సిద్ధం
author img

By

Published : Jun 10, 2021, 6:48 AM IST

ప్రభుత్వ భూముల వేలానికి రంగం సిద్ధం

నిధుల సమీకరణ కోసం భూముల అమ్మకానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వం, గృహనిర్మాణ సంస్థ వద్ద భూములు, ఇళ్లను విక్రయించడం ద్వారా నిధులు సమకూర్చుకోవాలని గత మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. తాజాగా మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలోనూ భూముల అమ్మకం అంశంపై చర్చ జరిగింది. అమ్మకం ప్రక్రియ ప్రారంభమైందా? అని ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆరా తీసినట్లు సమాచారం. గతంలో గృహనిర్మాణ సంస్థ విక్రయించిన భూములకు సంబంధించిన పన్నుల సమస్యను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిష్కరించుకోవాలన్న సీఎం కేసీఆర్​.. వీలైనంత త్వరగా భూముల అమ్మకం ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

సీఎం ఆదేశాలతో సంబంధిత అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సమీక్ష నిర్వహించారు. అమ్మకానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్న భూముల విక్రయం కోసం నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించారు. భూముల విక్రయం ద్వారా రూ.20 వేల కోట్లు, కనీసం రూ.10 వేల కోట్లు సమీకరించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఒకేమారు కాకుండా దశల వారీగా అమ్మకం ప్రక్రియ చేపడితే బాగుంటుందని భావిస్తున్నారు.

ముందుగా హెచ్​ఎండీఏ పరిధిలోని కోకాపేట భూములను విక్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ భూముల్లో ఎక్కువ విస్తీర్ణంతో కూడిన ప్లాట్లతో హెచ్​ఎండీఏ లేఅవుట్​ను అభివృద్ధి చేసింది. దీంతో ఆ భూములకు మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు. ఆ మేరకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ కానుంది. ఆ తర్వాత హెచ్​ఎండీఏ వద్దనున్న ఇతర భూములు, ప్రభుత్వం వద్దనున్న ఇతర భూములు, గృహనిర్మాణ సంస్థ వద్దనున్న ఇతర భూములను విక్రయిస్తారు.

ఇదీ చూడండి: కరోనా తగ్గిపోయాక చికిత్స గరిష్ఠ ధరలు ఖరారు చేస్తారా..?: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.