ETV Bharat / state

'ఎవరు అధికారంలో ఉన్నా.. రాయలసీమకు అన్యాయమే చేస్తున్నారు' - జీవో 203

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవాలని కుయుక్తులు పడటం దుర్మార్గమైన చర్య అని ఏపీలోని కడపజిల్లా అఖిలపక్షం నాయకులు మండిపడ్డారు. ఎవరు అధికారంలో ఉన్నా.. రాయలసీమకు తీవ్ర అన్యాయమే చేస్తున్నారని నాయకులు ఆరోపించారు. ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తే ఏపీ వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

agitation in kadapa
అఖిలపక్షం నాయకుల ధర్నా
author img

By

Published : Jun 28, 2021, 2:50 PM IST

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవాలని చూడడం దుర్మార్గమైన చర్య అని ఆంధ్రప్రదేశ్​లోని కడపజిల్లా అఖిలపక్షం నాయకులు ఆరోపించారు. రాయలసీమకు అన్యాయం చేసే విధంగా ప్రాజెక్టును నిలుపుదల చేయిస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా నీటిపై తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను నిలిపి వేయాలని కోరుతూ కడప కోటిరెడ్డి కూడలి వద్ద ఆందోళన చేపట్టారు. అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రాజెక్టుల విషయంలో దొంగాట ఆడుతున్నారని తెదేపా నాయకులు విమర్శించారు. ఎవరు అధికారంలో ఉన్నా.. రాయలసీమకు తీవ్ర అన్యాయమే చేస్తున్నారని రైతు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 203ను అమలు చేసే విధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కొనసాగించాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడుతామని నాయకులు హెచ్చరించారు.

ఇదీ చూడండి: నెక్లెస్ రోడ్‌లో 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహం ఆవిష్కరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.