ETV Bharat / state

'అవినీతి అధికారులను కోటీశ్వరులను చేశారు' - congress leader worte a letter

సీఎం కేసీఆర్​కు ఇండియా కిసాన్​ కాంగ్రెస్​ వైస్​ ఛైర్మన్​ కోదండరెడ్డి బహిరంగ లేఖ రాశారు. భూరికార్డుల సవరణ కార్యక్రమాల్లో జరిగిన అవినీతిపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

all india kisan cell congress vice chairmen kodhandareddy letter to cm kcr
'అవినీతి అధికారులను కోటీశ్వరులను చేశారు'
author img

By

Published : Aug 18, 2020, 6:18 PM IST

భూరికార్డుల సవరణ కార్యక్రమం అవినీతి అధికారులను కోటీశ్వరులను చేసిందని ఆల్‌ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వైస్ ఛైర్మన్ కోదండరెడ్డి ఆరోపించారు. గత 32 మాసాలుగా కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.

సీఎం నియోజకవర్గంలో దళిత రైతు తన పట్టాభూమిని ప్రభుత్వం అక్రమంగా లాక్కుందని మరణ వాగ్మూలంలో చెప్పి చనిపోయినా... ఆ ఘటనపై ఇప్పటి వరకు విచారణ జరగలేదని విమర్శించారు. ఇటీవల కీసర తహసీల్దార్ కోటి రూపాయలు లంచం తీసుకొని పట్టుబడితే ఆ విషయాలు బయటకు రాకుండా ప్రభుత్వం తొక్కిపెట్టిందని ఆక్షేపించారు. మియాపూర్‌లోని వివాదాస్పద భూములతో సహా ఎన్ని లక్షల ఎకరాలు గుర్తించారని కోదండరెడ్డి ప్రశ్నించారు.

ఇదీ చూడండి: పురపాలక శాఖ అధికారులు బాగా పనిచేశారు: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.