ETV Bharat / state

Air Pollution: కత్తి దూసిన కాలుష్యం.. 'దీపావళి' రోజు పెరిగిన తీవ్రత

కంటికి కనిపించదు.. గాలి పీల్చగానే నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి తిష్ఠవేసి అనారోగ్య సమస్యలకు కారణమయ్యే అతి సూక్ష్మ ధూళి కణాలు(పీఎం 2.5) ఈ దీపావళికి ‘దుమ్ము’ రేపాయి. నివాసిత ప్రాంతాల్లో బాణసంచా మోతతో చెవులకు చిల్లులు పడినట్లు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీఎస్‌పీసీబీ) నిర్వహించిన ప్రత్యేక అధ్యయనంలో వెల్లడైంది.

Air Pollution: కత్తి దూసిన కాలుష్యం.. 'దీపావళి' రోజు పెరిగిన తీవ్రత
Air Pollution: కత్తి దూసిన కాలుష్యం.. 'దీపావళి' రోజు పెరిగిన తీవ్రత
author img

By

Published : Nov 6, 2021, 10:14 AM IST

గాల్లో కలిసే కాలుష్య ఉద్గారాల్లో పీఎం 2.5, సూక్ష్మ ధూళి కణాలు(పీఎం 10), సల్ఫర్‌ డయాక్సైడ్‌, ఆక్సైడ్స్‌ ఆఫ్‌ నైట్రోజన్‌ ముఖ్యమైనవి. తల వెంట్రుక మందం 50 మైక్రోగ్రాములు. పీఎం 10 అంటే.. తల వెంట్రుకకు అయిదింతలు తక్కువ అన్న మాట. స్వచ్ఛమైన గాలిని ఇది కలుషితం చేస్తుంది. అనారోగ్య సమస్యలకు కారణమయ్యే అతి సూక్ష్మ ధూళి కణాలు(పీఎం 2.5) ఈ దీపావళికి ‘దుమ్ము’ రేపాయి. తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గాలిని పీలిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పీఎం2.5 విషయానికొస్తే.. తల వెంట్రుక మందంలో 20 రెట్లు తక్కువగా ఉంటుంది. పీఎం 10తో పోలిస్తే అత్యంత ప్రమాదకరం.

నివాసిత ప్రాంతాల్లో ‘మోత’

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) ఆదేశాల మేరకు నగరంలో వాయు, శబ్ద కాలుష్యంపై ప్రత్యేక అధ్యయనం నిర్వహించింది. సాధారణ రోజు(అక్టోబరు 29న), దీపావళి రోజు తీవ్రతను లెక్కించింది. ఆ గణాంకాలపై అధ్యయనం చేసి నివేదికను రూపొందించింది. సాధారణ రోజుల్లో కంటే పీఎం 2.5 తీవ్రత భారీగా పెరిగింది. ఆశ్చర్యకరంగా సల్ఫర్‌ డయాక్సైడ్‌, ఆక్సైడ్స్‌ ఆఫ్‌ నైట్రోజన్‌ తీవ్రత పండుగ రోజు తగ్గింది. జూబ్లీహిల్స్‌, తార్నాక తదితర ప్రాంతాల్లో శబ్ద కాలుష్యం భారీగా పెరిగింది.

ఇదీ చూడండి: Green Crackers: పర్యావరణ హిత టపాసులు.. కాలుష్యం తగ్గే అవకాశం

Corona with Diwali Firecrackers: టపాసులతో కొవిడ్‌ ఉద్ధృతి.. సాధారణం కంటే వేగంగా వ్యాప్తి!

Pollution declining during in Hyderabad : భాగ్యనగరంలో స్వచ్ఛమైన గాలి ఎక్కడుందో తెలుసా..?

Air pollution: హైదరాబాద్‌లో క్షీణిస్తున్న గాలి నాణ్యత.. ముప్పు తప్పదంటున్న నిపుణులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.