ETV Bharat / state

సీఎం కేసీఆర్​ కొత్త నాటకానికి తెర తీశారు: దాసోజు శ్రవణ్​ - Dasoju Shravan on bharath bundh

భారత్​ బంద్​కు మద్దతు పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్​ కొత్త నాటకానికి తెర తీశారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. కేసీఆర్​కు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయలేదని ఆయన ప్రశ్నించారు.

AICC spokesperson Dasoju Shravan fires on cm kcr
సీఎం కేసీఆర్​ కొత్త నాటకానికి తెర తీశారు: దాసోజు శ్రవణ్​
author img

By

Published : Dec 8, 2020, 3:54 AM IST

రైతు సంఘాల పిలుపుతో నేడు జరగనున్న భారత్ బంద్​కు తెరాస మద్దతు పేరుతో కేసీఆర్ కొత్త డ్రామాకు తెర తీశారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. కేసీఆర్​కు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించే చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయలేదని ఆయన ప్రశ్నించారు. వరదల్లో సర్వం కోల్పోయిన రైతులని కేసీఆర్ కనీసం పరామర్శించారా అని నిలదీశారు.

నియంతృత్వ వ్యవసాయంతో రైతులను ఇబ్బందుల పాలు చేసింది కేసీఆర్ కాదా అని శ్రవణ్​ ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగితే ప్రభుత్వం పోలీసుల చేత అణచి వేయిస్తోందని దుయ్యబట్టారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ బంద్​కు మద్దతిచ్చి.. విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అధికార పార్టీ మంత్రులను, ప్రజాప్రతినిధులను పోలీసులు గృహ నిర్బంధాలు చేయగలరా అని నిలదీశారు. మొన్నటి వరకూ ప్రధాని మోదీ ప్రజా వ్యతిరేక చర్యలకు మద్దతిచ్చిన కేసీఆర్.. ఇప్పుడు బంద్​కు మద్దతు పేరుతో కొత్త నాటకానికి తెర తీశారని ఎద్దేవా చేశారు.

ఇదీ చూడండి: మంగళవారం 'భారత్​ బంద్​'- అన్ని వర్గాల మద్దతు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.