ETV Bharat / state

'రాజగోపాల్​రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడరు.. ఉపఎన్నిక రాదు' - Vamshi Chand on Rajgopal Reddy

Vamshi Chand on Rajgopal Reddy : కాంగ్రెస్‌ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడటం దాదాపు ఖాయమైన పరిస్థితుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. చర్చించేందుకు దిల్లీకి రావాలని ఆపార్టీ అధిష్ఠానం ఆహ్వానించినా ఆయన వెళ్లకపోవడంతో కాంగ్రెస్‌ పెద్దలు బుజ్జగింపులు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్​రెడ్డి, ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి.. రాజగోపాల్ రెడ్డితో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజగోపాల్​రెడ్డి పార్టీని వీడరని వంశీచంద్​రెడ్డి స్పష్టం చేశారు.

'రాజగోపాల్​రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడడు.. ఉపఎన్నిక రాదు'

author img

By

Published : Jul 30, 2022, 12:58 PM IST

Vamshi Chand on Rajgopal Reddy : మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి కరుడుగట్టిన కాంగ్రెస్ వాదని.. పార్టీని వీడడని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్​రెడ్డి స్పష్టం చేశారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయరని.. ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదని పేర్కొన్నారు. హైదరాబాద్​లోని రాజగోపాల్​రెడ్డి నివాసంలో భేటీ అనంతరం ఆయన ఈ మేరకు వెల్లడించారు.

ఈ సందర్భంగా రాజగోపాల్​రెడ్డిని తాను రోజూ కలుస్తానని వంశీచంద్​రెడ్డి తెలిపారు. తెరాసతో కొట్లాడేది కాంగ్రెస్​ పార్టీనే అని స్పష్టం చేశారు. రాజగోపాల్​రెడ్డి కాంగ్రెస్​లోనే ఉండి తెరాసతో కోట్లాడతాడన్నారు. రాజగోపాల్​రెడ్డి పార్టీ మార్పుపై ఇటీవల బండి సంజయ్ మాటలు ఉత్తవేనని కొట్టిపారేశారు.

'రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడడు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడు. ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదు. నేను రాజగోపాల్ రెడ్డిని రెగ్యులర్​గా కలుస్తా. రాజగోపాల్​రెడ్డి పార్టీలో ఉంటూనే తెరాసతో కొట్లాడతారు.' -వంశీచంద్​రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి

అంతకుముందు ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి రాజగోపాల్​రెడ్డితో భేటీ అయ్యారు. రాజగోపాల్‌ పార్టీ మారకుండా చూసే బాధ్యతను పార్టీ అధిష్ఠానం ఆయనకు అప్పగించడంతో ఇవాళ జూబ్లీహిల్స్‌లోని రాజగోపాల్‌ రెడ్డి ఇంటికి వెళ్లారు. పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తల నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డిని ఉత్తమ్‌ బుజ్జగించినట్లు తెలుస్తోంది.

తెరాస పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించే దిశగా వేస్తున్న అడుగుల్లో రాజీ పడేది లేదని శుక్రవారం రాజగోపాల్‌ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. రాజీనామా, మనుగోడు ఉపఎన్నిక ఖాయమనే అంశాలను తేల్చి చెప్పారు. సొంత ప్రయోజనాలు, పదవులు తన లక్ష్యం కాదని పేర్కొంటూ ఇటీవల వస్తున్న విమర్శపై స్పందిస్తూ.. తన నిర్ణయాన్ని మునుగోడు నియోజకవర్గ ప్రజలతో పాటు అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయంటూ కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరే అంశాన్ని పరోక్షంగా పేర్కొన్నారు. మరో కురుక్షేత్ర యుద్ధానికి సమర శంఖం పూరించాలంటూ మునుగోడు ఉప ఎన్నిక ఖాయమన్నట్లు సంకేతాలిచ్చారు.

ఇవీ చూడండి.. Rajagopal Reddy: ఆ బాధతోనే భట్టి విక్రమార్క కలిశారు: రాజగోపాల్ రెడ్డి

స్కేటింగ్​లో చిన్నారి గిన్నిస్​ రికార్డ్​.. 13.74 సెకన్లలో 20 కార్ల కింద నుంచి..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.