హైదరాబాద్లోని సచివాలయంలో దేవాలయం, మసీదులను కూల్చివేయడం దారుణమని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి అన్నారు. మనోభావాలను దెబ్బతీసేలా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఇలా వ్యవహరించిన వారికి శిక్ష తప్పలేదన్నారు.
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం గనులలోని ఇనుప ఖనిజాన్ని దోచుకునే దుర్భుద్ధితో సుంకులమ్మ దేవాలయాన్ని కూల్చి వేయడం వల్ల ఆ దేవత శాపానికి గురై శిక్ష పడిందని ఉదహరించారు. ఇప్పుడు కేసీఆర్ తన కుమారుడిని ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచనతోనే కొత్త సచివాలయం నిర్మిస్తున్నారని విమర్శించారు.
ఇదీ చూడండి: ఆస్తికోసం కొడుకుల కుట్ర.. ఆలయంలో తలదాచుకున్న తల్లి..