ETV Bharat / state

'ఈ సమయంలో సచివాలయం కట్టడం ఎందుకని ప్రజలే ప్రశ్నిస్తున్నారు' - తెలంగాణ తాజా వార్తలు

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే... జవాబు చెప్పలేని మంత్రులు ఆరోపణలు చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ ధ్వజమెత్తారు. కరోనాతో ప్రజల ప్రాణాలు పోతుంటే... ఈ సమయంలో 500 కోట్లు పెట్టి సచివాలయం ఎందుకు కడుతున్నారని ప్రజలే ప్రశ్నిస్తున్నారని తెలిపారు.

sampath kumar criticized on government
'ఈ సమయంలో సచివాలయం కట్టడం ఎందుకని ప్రజలే ప్రశ్నిస్తున్నారు'
author img

By

Published : Jul 8, 2020, 9:37 PM IST

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతంగా ఉన్న సమయంలో సచివాలయం నిర్మాణం ఇప్పుడు అవసరమా అని ప్రశ్నిస్తున్న తమపై తెరాస మంత్రులు తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారని కాంగ్రెస్​ ఆరోపించింది. వైద్య సౌకర్యాలు కల్పించడానికి నిధులు సక్రమంగా కేటాయించని ప్రభుత్వం... సచివాలయం కట్టడం అవసరమా ఏఐసీసీ కార్యదర్శి సంపత్​కుమార్​ అన్నారు.

సచివాలయం కూల్చివేతకు హైకోర్టు అనుమతి ఇవ్వగానే ఆగమేఘాల మీద అర్ధరాత్రి నుంచే కూల్చేస్తున్నారని ఆక్షేపించారు. కల్వకుంట్ల కుటుంబానికి వాస్తు సరిగా లేదని, ఉన్నవి కూల్చేసి వేలకోట్లతో భవనాలు నిర్మించడం దుర్మార్గమన్నారు.

'ఈ సమయంలో సచివాలయం కట్టడం ఎందుకని ప్రజలే ప్రశ్నిస్తున్నారు'

ఇదీ చదవండి : ప్యాలెస్‌ ఆఫ్‌ వర్సైల్స్‌ స్ఫూర్తిగా నూతన సచివాలయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.