ETV Bharat / state

పీసీసీ అధ్యక్షుడి వేటలో కాంగ్రెస్​ అధిష్ఠానం

పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రాజీనామా చేయటంతో తెలంగాణ రాష్ట్ర కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై ఏఐసీసీ దృష్టి సారించింది. పార్టీని బలోపేతం చేసే నాయకుడికే పీసీసీ పీఠం దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్‌ నేతల పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

aicc on telengana pradesh congress committee president
పీసీసీ అధ్యక్షుడి వేటలో కాంగ్రెస్​ అధిష్ఠానం
author img

By

Published : Dec 4, 2020, 10:44 PM IST

గ్రేటర్‌ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకు కాంగ్రెస్‌ పరిమితం కావటంతో పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి రాజీనామా చేశారు. కొత్త అధ్యక్షుడి నియామకం జరిగే వరకు తానే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతానని తెలిపారు. త్వరితగతిన కొత్త ఛీఫ్‌ను ఎన్నుకోవాలని రాజీనామా లేఖలో స్పష్టం చేసినట్లు చెప్పారు. ఉత్తమ్​ రాజీనామాతో రాష్ట్ర కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై ఏఐసీసీ దృష్టి సారించింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేసే నాయకుడికే పీసీసీ పీఠం దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్‌ నేతల పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 9న సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కొత్త పీసీసీని ప్రకటించే అవకాశం ఉందని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

మరోవైపు ఓ ఎంపీ తనకే పీసీసీ అధ్యక్ష పీఠం దక్కుతుందని.. ఒకట్రెండు రోజుల్లో తన పేరును అధిష్ఠానం ప్రకటిస్తుందని వెల్లడించారు. పీసీసీ కోసం డజన్‌ మందికిపైగా పేర్లు అధిష్ఠానం వద్ద ఉన్నప్పటికీ ఇద్దరు ఎంపీల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తాజాగా మరొక సీనియర్‌ ఎమ్మెల్యే పేరు కూడా తెరపైకి వచ్చినట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇదీ చదవండి: తెలంగాణలో భాజపా విస్తరణ... ఇదే షా వ్యూహం...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.