ETV Bharat / state

ఆ ల్యాబ్స్ రైతులకు ఎంతో ఉపయోగకరమన్న నిరంజన్​ రెడ్డి

niranjan reddy visit horticultural crops రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి ఉద్యాన పంటలను పరిశీలించారు. ఏపీలోని గుంటూరు జిల్లాలో పర్యటించిన ఆయన రైతులు అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు.

niranjan reddy
niranjan reddy
author img

By

Published : Aug 25, 2022, 9:14 PM IST

niranjan reddy visit horticultural crops: ఉద్యాన పంటల సాగులో రైతులు అనుసరిస్తున్న విధానాలను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి పరిశీలించారు. అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. రైతులు విత్తనం మంచిదో, నకిలీదో ముందుగానే తెలుసుకునే వీలుంటుందని తెలిపారు. ఏపీలోని గుంటూరు జిల్లా బల్లిపొర మండలం వల్లబాపురంలో ఉద్యాన పంటలను మంత్రి పరిశీలించారు. సేంద్రీయ విధానంలో పండ్లతోటలు సాగు చేస్తున్న విధానాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఒకే ప్రాంతంలో భిన్నమైన ఉద్యానపంటల సాగుని అధికారులు మంత్రికి వివరించారు.

ఏపీలో వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో వినూత్నమైన పద్ధతుల్లో వ్యవసాయాన్ని బలోపేతం చేసినం. మాకు అనుకూలమైన పద్ధతుల్లో నిర్ణయాలు తీసుకున్నాం. మా వద్ద వరంగల్ జిల్లా పరకాలలో అరటి తోటలు పెంపకం పెరిగింది. అగ్రి టెస్టింగ్ ల్యాబోరేటరీ చాలా ఉపయోగకరం. రైతుల వినియోగించేముందు విత్తనాలను టెస్టింగ్ చేయడం మంచి ఆలోచన. ఇది చాలా గొప్ప విషయం. అందుకే ఈ విధానాన్ని ప్రత్యక్షంగా చూసేందుకే వచ్చా. - సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి

అనంతరం తెనాలి వ్యవసాయ మార్కెట్​లో రైతు భరోసా కేంద్రాన్ని నిరంజన్​ రెడ్డి సందర్శించారు. అక్కడ రైతులకు అందిస్తున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. అంగలకుదురులో వ్యవసాయ ప్రయోగశాలను మంత్రి పరిశీలించారు. ప్రయోగశాలలో రైతులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఇలాంటి ప్రయోగశాలలు తెలంగాణాలోనూ ఏర్పాటు చేసే విషయం పరిశీలిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ పాల్గొన్నారు. వ్యవసాయానికి ప్రభుత్వం తరపున అందిస్తున్న సహకారాన్ని మంత్రికి ఎమ్మెల్యే వివరించారు.

ఆ ల్యాబ్స్ రైతులకు ఎంతో ఉపయోగకరమన్న నిరంజన్​ రెడ్డి

ఇవీ చదవండి: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్తానన్న కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

టిక్​టాక్ స్టార్ మృతి కేసులో ట్విస్ట్, హత్యేనని తేల్చిన పోలీసులు, ఇద్దరు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.