హైదరాబాద్లో లాక్డౌన్తో ఉపాధి లేక ఇబ్బంది పడుతోన్నపేదలు, వలస కూలీలకు సుల్తాన్ బజార్ పోలీసులు చేయూతనిచ్చారు. పేదలకు, కూలీలు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు అందజేశారు.
గోషామహల్ నియోజకవర్గంలో లాక్డౌన్ వల్ల ఉపాధి లేక ఇబ్బంది పడుతోన్న పేదలు, వలస కార్మికులకు ఆదిత్య కృష్ణ ట్రస్ట్ చేయూతనిస్తోంది. 54 రోజులుగా అబిడ్స్, సుల్తాన్ బజార్ వంటి పలు ప్రాంతాల్లోని పేదలకు నిత్యావసరాలు అందజేస్తున్నారు.
లాక్డౌన్ ముగిసే వరకు పేదలు, వలస కూలీలకు అండగా ఉంటామని ట్రస్ట్ ఛైర్మన్ నందకిశోర్ బిలాల్ తెలిపారు. కరోనా వంటి ఆపత్కాలంలో తమకు చేతనైనంత సాయం చేస్తున్నామని చెప్పారు.