మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా' ఎన్నికల్లో తమ ప్యానెల్ ఎలా ఓడిపోయిందో దుర్గమ్మకే తెలియాలని నటి హేమ అన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం ఆమె ఆంధ్రప్రదేశ్‌లోనే విజయవాడ ఇంద్రకీలాద్రిని సందర్శించి.. కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సిబ్బంది ఆమెకు తీర్థ ప్రసాదాలు అందించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ హేమ భావోద్వేగానికి లోనయ్యారు. తాను ఎంతగానో ఆరాధించే దుర్గమ్మ దీవెనలు పొందడం ఆనందంగా ఉందన్నారు.
‘‘నాకు దుర్గమ్మపై అపారమైన నమ్మకం ఉంది. ప్రతి సంవత్సరంలాగే ఈ సారి కూడా అమ్మ దీవెనలు పొందడం నాకెంతో సంతోషంగా ఉంది. ఆనందంతో కన్నీళ్లు వచ్చేస్తున్నాయి’- హేమ
‘మా’ ఎన్నికలపై స్పందన..
‘రాత్రికి గెలిచి.. ఉదయానికే ఎలా ఓడిపోయామో నాకు తెలియడం లేదు. దానికి గల కారణం అమ్మవారికైనా తెలుసో లేదో’ అని హేమ వ్యంగ్యంగా మాట్లాడారు. ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ తరఫున హేమ పోటీలో నిలబడిన విషయం తెలిసిందే. వీరి ప్యానెల్ నుంచి పోటీ చేసిన అనసూయ ఫలితం అంతటా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 10న ఆమె గెలిచినట్లు చెప్పి.. 11న ఆమె ఓడిపోయిందని ప్రకటించారు.
ఇదీ చదవండి: ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ ఆరోపణలు.. ఖండించిన 'మా' ఎన్నికల అధికారి
Maa elections 2021: విష్ణును డిస్టర్బ్ చేస్తే బాగుండదు: నరేశ్