డ్రోన్స్ ద్వారా సీడ్ బాల్స్(seed balls by drones) వెదజల్లే కార్యక్రమాలు ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో చేస్తుంటారని... మన ప్రాంతంలో వీటిని ప్రయోగించటం శుభపరిణామని సినీనటుడు దగ్గుబాటి రానా అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో మారట్ డ్రోన్స్(Rana inaugurated marut drones)ను రానా ప్రారంభించారు. తెలంగాణ ఐటీ, అటవీశాఖల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
మనిషి మనుగడను కాపాడటం కోసం సాంకేతికను వినియోగించడం గొప్ప విషయం. ఆస్ట్రేలియా లాంటి దేశాల్లోనే డ్రోన్స్(Rana inaugurated marut drones) వినియోగించడం లాంటి వార్తలు వింటుంటాం. మన దేశంలోనూ డ్రోన్స్ ద్వారా విత్తనాలు వెదజల్లే కార్యక్రమం చేపట్టడం గొప్ప విషయం. ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వం, ప్రజల మద్దతు చాలా అవసరం. -రానా దగ్గుబాటి, సినీ నటుడు
డ్రోన్స్ ద్వారా 2030కల్లా 100 కోట్ల విత్తనాలు వేయనున్నామని... తెలంగాణలో ఈ ఏడాది అన్ని జిల్లాల్లో కలిపి 50 లక్షల మొక్కలు నాటేందుకు ప్రయత్నిస్తున్నామని మారట్ డ్రోన్స్(Rana inaugurated marut drones) వ్యవస్థాపకులు ప్రేమ్ కుమార్ తెలిపారు. హర బహారా పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని... ఏరియల్ సీడింగ్ విషయంలో భారత్‌లో ఇదే మొదటిదని పేర్కొన్నారు. కార్మికులు చేరుకోలేని ప్రాంతాల్లో ఈ ప్రయోగాన్ని చేపడుతున్నామని.. స్థానికంగా పెరిగే మొక్కలకే ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు.
ఇదీ చదవండి: Scam In Telugu Academy: తెలుగు అకాడమీలో గోల్‌మాల్‌పై సీసీఎస్ దర్యాప్తు