ETV Bharat / state

14 రోజులు ఇంట్లోనే ఉంటా: నటుడు ప్రియదర్శి - coronavirus treatment

కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ హాస్యనటుడు ప్రియదర్శి తన వంతు సామాజిక బాధ్యతను నిర్వర్తించారు. 14 రోజులపాటు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉంటానని ట్వీట్​ చేశారు.

actor priyadarshi tweet on corona in hyderabad
ఇంట్లోనే ఉంటానంటున్న ప్రియదర్శి
author img

By

Published : Mar 17, 2020, 8:20 PM IST

ప్రముఖ హాస్యనటుడు ప్రియదర్శి 14 రోజులపాటు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉంటానని ట్వీట్​ చేశారు. కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభాస్ నటిస్తున్న చిత్రం కోసం ఇటీవలే జార్జియా వెళ్లిన ప్రియదర్శి షూటింగ్ ముగించుకొని హైదరాబాద్​కు తిరిగి వచ్చారు.

శంషాబాద్ విమానాశ్రయంలో అతనికి వైద్యులు స్క్రీనింగ్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ మేరకు సామాజికంగా ప్రజలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో 14 రోజులు ఇంటికే పరిమితమవుతున్నట్లు ప్రియదర్శి తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందు జాగ్రత్త కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి:తెలంగాణలో మరో కరోనా కేసు: మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.